ప్రేమలో పడతానంటున్న 'షామిలి'
'అంజలి' పాపగా అందరి మదినీ దోచుకున్న పాప బేబి షామిలి. ఆ తర్వాత ఈ మధ్యనే హీరోయిన్ గా 'ఓయ్' అని పలకరించి అంగదరి మన్ననలూ పొందింది. 'ఓయ్' తెచ్చిన పేరుతో మరిన్ని చిత్రాల్లో నటిస్తుందన్న అందరూ భావించారు. కానీ తాను మాత్రం నటనకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు తెలిసింది. ఈ విషయమై వివరణ ఇచ్చిన షాలిని తాను ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేద్దామనుకుంటుండగా 'ఓయ్'లో అవకాశం వచ్చిందని, కథ బాగుండటంతో ఎందుకు చెయ్యకూడదు అని చేసానని, కానీ ప్రస్తుతం తాను సింగపూర్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తూ బిజీగా వున్నానని, ఇంకో ఎడాది వంకూ సినిమాలేవీ ఒప్పుకోనని చెప్పింది.
ఇక పెళ్లి గురించి ఆలోచించే సమయం ఇంకా రాలేదనీ, కానీ తాను మాత్రం తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని, ఎవరో ఏమిటో తెలియకుండా ఓ వ్యక్తితో జీవితం పంచుకోవడం తనకు నచ్చదనీ చెప్పుకొచ్చింది.
shamili oye siddharth anand ranga yuvanshankar raja anjali షామిలి ఓయ్ సిద్ధార్థ ఆనంద్ రంగా యువన్ శంకర్ రాజా అంజలి


Click it and Unblock the Notifications