twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తల్లిదండ్రులని లంచం అడిగారు.. చాలా బాధించింది.. అందుకే 'భారతీయుడు' చిత్రం!

    |

    శంకర్ తెరకెక్కించిన ప్రతి చిత్రంలో సమాజానికి సంబందించిన సందేశాత్మక అంశం ఏదో ఒకటి ఉంటుంది. అందుకే శంకర్ చిత్రాలకు ప్రశంసలు దక్కుతుంటాయి. 1996లో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా అభిమానులంతా శంకర్ దర్శకత్వ ప్రతిభకు, కమల్ హాసన్ విలక్షణ నటనకు ఫిదా అయ్యారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. భారతీయుడు 2 చిత్రానికి దర్శకుడు శంకర్, కమల్ హాసన్ ఈ రోజే ప్రారంభించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా భారతీయుడు చిత్రాన్ని రూపొందించడానికి గల కారణాన్ని శంకర్ వివరించారు.

    లంచంపై సంధించిన అస్త్రం

    లంచంపై సంధించిన అస్త్రం

    భారతీయుడు చిత్రానికి ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు కూడా లభించాయి. భారత దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న లంచగొండి తనంపై శంకర్ ఈ చిత్రంతో అస్త్రం సంధించారు. ఉన్నధికారుల నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు లంచం ఎలా వ్యాపించిందో ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం రూపిందించడానికి తాను స్వయంగా చూసిన, అనుభవించిన సంఘటనలే కారణం అని శంకర్ తెలిపారు.

    అజిత్ 'విశ్వాసం'కి హ్యాట్సాఫ్.. పోలీస్ కమిషనర్ ఫిదా.. కూతురి కోసం అంత కంగారులో కూడా! అజిత్ 'విశ్వాసం'కి హ్యాట్సాఫ్.. పోలీస్ కమిషనర్ ఫిదా.. కూతురి కోసం అంత కంగారులో కూడా!

    కాలేజీ అడ్మిషన్ కోసం

    కాలేజీ అడ్మిషన్ కోసం

    ఓ కాలేజీలో తాను అడ్మిషన్ కోసం వెళ్లగా ఆదాయ, కుల ధ్రువ పత్రం తీసురావాలని అడిగారు. ఆ పత్రాలు తీసుకురావడానికి నా తల్లిదండ్రులతో పాటు నేను కూడా ప్రభుత్వ అధికారులు వద్దకు వెళ్ళా. ఆ సమయంలో మా అమ్మా నాన్నలని అధికారులు లంచం అడగడం చూశాను. ఆ సంఘటన తనని ఎంతగానో బాధించింది. ఆ ఘటననే తనని భారతీయుడు 2 చిత్రం రూపొందించేలా చేసిందని శంకర్ తెలిపారు.

    సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్య

    సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్య

    ఇక భారతీయుడు 2 చిత్రంలో ప్రస్తుత సమాజంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలని హైలైట్ చేయబోతున్నట్లు శంకర్ తెలిపారు. కమల్ హాసన్ ఓల్డ్ మాన్ గెటప్ లో చేయబోయే విన్యాసాల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా శంకర్ లాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    కమల్‌కు జోడిగా కాజల్

    కమల్‌కు జోడిగా కాజల్

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కమల్ కు జోడిగా నటించే లక్కీ ఛాన్స్ ని పట్టేసింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. హీరో సిద్ధార్థ్, శింబు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐ, 2.0 రెండు చిత్రాలలో శంకర్ మార్క్ మిస్ అయిందనే విమర్శలు వినిపించాయి. దీనితో భారతీయుడు 2 చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి సత్తా చాటాలని శంకర్ భావిస్తున్నాడు.

    English summary
    Shankar about his college incident which is forced him to do Indian movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X