'రొబో' దర్శకుడు శంకర్ నటుడుగా కూడా...
ఇన్నాళ్ళూ తెర వెనకే ఉండి ఏలిన దర్శకుడు శంకర్ తన తాజా చిత్రం 'రొబో' లో ఓ కీలక పాత్ర వేసినట్లు చెన్నై వర్గాలు చెప్తున్నారు. అయితే రజనీ బలవంతం మీదే ఈ గెస్ట్ రోల్ ని ఆయన చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక శివాజీ అనంతరం శంకర్ చేస్తున్న ఈ చిత్రం భారీ ఖర్చుతో రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2400 సంవత్సరంలో సినిమా కథ ప్రారంభం అవుతుందని తెలిసింది. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. భవిష్యత్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
అలాగే ఈ 'రోబో' చిత్రంలో ఒక షాట్‌లో వందమంది రజనీకాంత్‌లు కనిపించనున్నారని సమాచారం. తన సినిమాలోని పాటల చిత్రీకరణలో ఏదొక కొత్తదనం చూపించే శంకర్ ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన స్కీమ్‌ని అనుసరిస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పాటకు ప్రభుదేవా నృత్యదర్శకత్వం వహించనున్నారు. ఈ పాట మొత్తం బ్లూ మాట్‌లో చిత్రీకరించారని తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని అయ్యంగార్ ఇంటర్నేషనల్ మరియు యూరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'జురాసిక్ పార్క్" చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన స్టాన్ విన్‌స్టన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తున్నారు అలాగే 'ది లెజెండ్, ది మ్యాట్రిక్స్" లాంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ స్టంట్ మాస్టర్ ఈన్ వూ పింగ్ 'రోబో" చిత్రానికి స్టంట్స్ నిర్వహిస్తున్నారు. ఇక రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, శంకర్, ఎ.ఆర్.రెహమాన్...కాంబినేషన్‌లో వస్తున్న 'రోబో' సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతునే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











