For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాత్రి పార్టీలకు వెళ్లోద్దంటూ హీరోయిన్ కి స్ట్రాంగ్ వార్నింగ్

  By Srikanya
  |

  చెన్నై : మిడ్ నైట్ పార్టీలకు వెళ్లడం మానేయమని అమీ జాక్సన్‌కి దర్శకుడు శంకర్‌ గట్టిగా సూచించారు. ఆయన ప్రస్తుతం విక్రమ్‌తో ఓ చిత్రం చేస్తున్నారు. అమీ జాక్సన్‌ నాయిక. పార్టీల్లో పాల్గొనడం మూలంగా షూటింగ్ సమయంలో ఆమె ఇబ్బందిపడుతోందట. తన సినిమా పూర్తయ్యే వరకూ విందువినోదాలకు దూరంగా ఉండమన్నారని సమాచారం. గతంలో రెండు మూడు సార్లు ఆమెకు సూచన ప్రాయంగా ఈ విషయం చెప్పినా వినకపోవటంతో గట్టిగానే వార్నింగ్ తరహాలో శంకర్ సీరియస్ గా చెప్పినట్లు చెన్నై వర్గాలు అంటున్నాయి.

  విక్రమ్, అమీ జాక్సన్‌ కాంబినేషన్ లో 'ఐ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

  దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి అమీ జాక్సన్ 180 రోజులు కేటాయించారు. అమీ జాక్సన్ ఈ చిత్రంతో తన కెరీర్లోనే అత్యంత భారీ మొత్తం తీసుకుంటోంది. 'ఐ' చిత్రం కోసం ఆమెకు రూ. 75 లక్షల రెమ్యూనరేషన్ నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.'మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  
 Director Shankar is busy in shooting Vikram’s ‘I’ in Chennai harbour now. He is well soft kinded person in Kollywood but when come to films he is strictly wants his casts perform well before the camera. He recently asked Amy to stop all those parties till his film shooting is over. As we know Amy is playing the female lead role in Vikram’s ‘I’. As she used to go parties at night times, She is not sleeping well at nights. So she came to shooting either by late or without freshness in her eyes. This upset the director well as he always wants the perfection in his film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X