శంకర్ కొత్త రోబోట్ అజిత్!

By Staff

రోబోట్ సినిమాకు షారూక్ ఖాన్ టాటా చెప్పినప్పటికీ దర్శకుడు శంకర్ తన ప్రయత్నాలను మానుకోలేదు. షారూక్ ఖాన్ బదులుగా ఆ పాత్రను అజిత్ చేత చేయించాలని శంకర్ భావిస్తున్నాడు. ఈ మేరకు శంకర్, అజిత్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. రూ.100 కోట్ల ఈ రోబోట్ ప్రాజెక్టు కోసం తనను సంప్రదించినట్టు అజిత్ కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని అజిత్ అంటున్నాడు. ఈమారు సంప్రదింపులు సత్ఫలితాన్నే ఇస్తాయనుకుంటున్నట్టు అజిత్ చెప్పాడు. రోబోట్ ప్రాజెక్టు కనుక ఫైనల్ అయితే ఈ లోపు రాజు సుందరం, కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమాలను అజిత్ త్వరగా పూర్తిచేసుకోవాల్సి ఉంది. రోబోట్ స్క్రిప్ట్ తనకు నచ్చిందని అజిత్ అంటున్నాడు. ఆ సినిమా కోసం కావలిసిన డేట్స్ ను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. అంతకన్నా ముందుగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని అజిత్ గుర్తు చేశాడు. ఈ సినిమాకు నిర్మాతను దొరకబుచ్చుకోవడం శంకర్ కు పెద్ద కష్టమేమీ కాదని అజిత్ అంటున్నాడు.

More from Filmibeat

Read more about: shankar ajith tamil movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X