డైరెక్టర్ శంకర్‌కు బిగ్ షాక్.. ఆగిపోయిన భారతీయుడు 2.. అంత బడ్జెట్ ఎవరు పెడతారు!

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇటీవల భారతీయుడు 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సమాజంలో జరిగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా బలమైన కథ రూపొందించినట్లు శంకర్ తెలిపారు. కానీ ఆరంభంలోనే శంకర్ కు ఎదురు దెబ్బ తగిలింది. భారతీయుడు 2 చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

 అప్పటి పరిస్థితుల నేపథ్యంలో

అప్పటి పరిస్థితుల నేపథ్యంలో

శంకర్ తెరకెక్కించిన అద్భుత చిత్రాలలో భారతీయుడు ఒకటి. 1996లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. అప్పటి సమాజంలో లంచగొండి తనం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం లాంటి అంశాల్ని హైలైట్ చేస్తూ శంకర్ భారతీయుడు చిత్రాన్ని రూపొందించారు. అదే తరహాలో ఇటీవల తాను గమనించిన కొన్ని పరిస్థితులకు అనుగుణంగా భారతీయుడు 2 కథ సిద్ధం చేశానని తెలిపారు. భారతీయుడు తరహాలోనే కమల్ హాసన్ సీక్వెల్ లో కూడా ఓల్డ్ మాన్ లుక్ లో నటించడానికి సిద్ధం అయ్యారు.

అనేక ఊహాగానాలు

అనేక ఊహాగానాలు

భారతీయుడు 2 షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ఆగిపోయింది. దీనితో భారతీయుడు 2 ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలని ఖండిస్తూ భారతీయుడు 2 ఆగిపోలేదని, కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం కోసం బ్రేక్ తీసుకున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. కమల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ వస్తావ పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం ముందుకెళ్లే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు.

తప్పుకున్న నిర్మాణ సంస్థ

తప్పుకున్న నిర్మాణ సంస్థ

కొన్ని కారణాల వలన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని అటు లైకా ప్రొడక్షన్స్, ఇటు కమల్ హాసన్ తో సంప్రదింపులు జరుపుతూ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ లైకా ప్రొడక్షన్స్ మాత్రం ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ససేమిరా అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో నిర్మాత కోసం

మరో నిర్మాత కోసం

ఇదిలా ఉండగా దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ పెట్టగలిగే మరో నిర్మాత కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ కోరుకున్న విధంగా బడ్జెట్ పెట్టగలిగే నిర్మాతలు దొరుకుతారో లేదో చూడాలి. ఇక కమల్ హాసన్ 2020 లోపు సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నారు. భారతీయుడు 2 చిత్రానికి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X