twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోబో2.0 టీజర్ వాయిదాపై శంకర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ కంపెనీపై లైకా కేసు!

    వాస్తవంగా రోబో2.0 చిత్రానికి సంబంధించిన టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే టీజర్ విడుదలపై జరిగిన జాప్యంపై శంకర్ ట్వీట్టర్‌లో వివరణతోపాటు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు.

    By Rajababu
    |

    సంచలన దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న రోబో2.0 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో రజనీకాంత్‌తోపాటు అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటిస్తున్నారు. వాస్తవంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే టీజర్ విడుదలపై జరిగిన జాప్యంపై శంకర్ ట్వీట్టర్‌లో వివరణతోపాటు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు.

    రోబో2.0 టీజర్

    రోబో2.0 టీజర్

    రోబో2.0 టీజర్ వర్క్ లాస్ ఎంజెలెస్‌లో జోరుగా సాగుతున్నది. ఈ టీజర్‌కు చాలా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం. ఆ పనులు పూర్తికాకపోవడం వల్ల టీజర్ విడుదల వాయిదా వేశాం. ఆ పనులు పూర్తికాగానే టీజర్‌ను విడుదల చేస్తాం అని శంకర్ ట్వీట్ చేశారు.

    రోబో రిలీజ్ డేట్ కూడా

    రోబో రిలీజ్ డేట్ కూడా

    కొద్ది నెలలక్రితం అమెరికాలోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థకు గ్రాఫిక్స్ పనులు అప్పగించాం. అయితే పనులకు నిర్దేశించిన డెడ్‌లైన్ చేరుకోవడంలో సదరు సంస్థ విఫలం కావడంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది.

    నష్టపరిహారానికి డిమాండ్

    నష్టపరిహారానికి డిమాండ్

    రోబో సినిమా విడుదలకు జాప్యం కారణమైందనే ఆరోపణలపై సదరు సంస్థపై త్వరలోనే లైకా ప్రొడక్షన్ దావా వేసేందుకు సిద్ధమవుతున్నది. తమకు జరిగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలనే లక్ష్యంతో పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయనిపుణుల సలహాలను తీసుకొంటున్నది.

    రోబోకు కొనసాగింపు కాదు

    రోబోకు కొనసాగింపు కాదు

    కాగా, రోబో2.0 చిత్రం రోబోకు కొనసాగింపు కాదు. ప్రపంచానికి ఉపయోగపడే అద్భుతమైన సందేశంతో రోబో2.0 రూపొందుతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనే ధీమాను ఇటీవల శంకర్ వ్యక్తం చేశాడు.

    ఏప్రిల్ 14న రిలీజ్

    ఏప్రిల్ 14న రిలీజ్

    ముందస్తు ప్లాన్ ప్రకారం రోబో2.0 రిపబ్లిక్ డే రోజునే విడుదల కావాల్సి ఉండేది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం వలన రిలీజ్ డేట్‌ను ముందుకు జరిపారు. ఈ చిత్రాన్నిఏప్రిల్ 14న తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు లైకా ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నది.

    English summary
    Shankar's dream project 2.0 was wrapped up months ago and the post-production is going on in full swing. The film, starring Rajinikanth, Akshay Kumar and Amy Jackson is a sequel to the director's Enthiran. Wishing his fans a Happy Republic Day, director Shankar surprised us all by giving us an update on the much-anticipated 2.0 teaser release. రోబో2.0 చిత్రానికి సంబంధించిన టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే టీజర్ విడుదలపై జరిగిన జాప్యంపై శంకర్ ట్వీట్టర్‌లో వివరణతోపాటు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X