సౌత్ ఇండియా లో భారీ చిత్రాల దర్శకుడుగా పేరు గాంచిన శంకర్ తాజాగా యంత్రం అనే సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ తీసుకునే చాలా డెసిషన్స్ కీ రజనీకాంత్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. తాజాగా శంకర్ యూరప్ లోని ఓ ఫ్యాషన్ హౌస్ కి దాదాపు ఐదు కోట్ల విలువ చేసే డ్రస్ కి ఆర్డర్ ఇచ్చారు. ఆ డ్రస్ కేవలం రజనీ ఓ పాటలో వాడటానికి ...అది అరనిముషం కూడా ఉండదు. ఇది తెలిసుకున్న రజనీకాంత్ చాలా ఫీలయ్యారట. ఇలా చేస్తే ఓవర్ బడ్జెట్ అయి మార్కెటింగ్ కి ఇబ్బంది అవుతుందని ఆయన తన వారితో అన్నారుట. పోనీ ఇది పద్దతి కాదని శంకర్ కి చెప్పి చూడండని అంటున్నా వద్దు డైరక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నాక హీరో మధ్యలో వేలు పెట్టకూడదని చెప్తున్నాడాయన. అదీ సంగతి