అపరిచితుడు కాంబినేషన్ లో మరో సినిమా...!?
'అపరిచితుడు" కాంబినేషన్ మరో మారు రిపీట్ కాబోతోంది. తమిళ సినీ పరిశ్రమలో కనీ వినీ ఎరుగతని బడ్జెట్ తో విక్రమ్ హీరోగా శంకర్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ సినిమా స్ర్కీన్స్ పై ఓ అద్భుతంగా నిలిచిపోనుందట. ప్రస్తుతం సినిమా బడ్జెట్ ఎంత కావాల్సి వుంటుందనే విషయమై శంకర్ బిజీగా వున్నాడనీ, ఇన్సూరెన్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడనీ తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆగస్ట్ లో ఈ సినిమా లాంఛనంగా సెట్స్ పైకి వెళ్తుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు విన్సిస్తున్నాయి.
'అపరిచితుడు" తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, విక్రమ్ కి రేంజ్ హిట్ రాలేదనే చెప్పాలి. అయితే 'రోబో" సినిమా తర్వాత శంకర్ రేంజ్ అమాంతం ఆకాశమెత్తు పెరిగిపోయిన దరిమిలా, విక్రమ్-శంకర్ కాంబినేషన్ పై పెరిగిపోయే అంచనాలకు హద్దే వుండదు. అన్నట్టు ఈ సినిమాలో 'రోబో" షేడ్స్ ఎక్కువగా వుండబోతున్నాయట. అంటే 'రోబో" సినిమాకి సీక్వెల్ అయ్యి వుండొచ్చేమో. ఇదే విషయమై కోలీవుడ్ లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, శంకర్ మాత్రం నోరు మెదపడంలేదు..


Click it and Unblock the Notifications











