త్రి ఇడియిట్స్ తర్వాత శంకర్ చిత్రం డిటేల్స్
తన సినిమాల్లో కమర్షియాలిటీతో పాటు ఏదో ఒక సందేశాన్ని తప్పనిసరిగా కోరుకునే శంకర్ తన తదుపరి చిత్రానికి అప్పుడే కథను రెడీ చేసుకుంటున్నారు. అయితే ఈ సారి కథ నిజ జీవిత పాత్రపై రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆ పాత్ర మరెవరో కాదు అన్నా హజారే. అవినీతిపై యుద్దం ప్రకటించి అంతటా సంచలనం సృష్టిస్తున్న హజారే జీవిత చరిత్రను ఆయన తెరకెక్కించాలని నిర్ణయించుకుని ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా చేస్తున్న పోరాట నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కొద్ది నెలల్లో తెలుస్తాయి. ఇక ప్రస్తుతం విద్యా వ్యవస్దలోని లొసుగులు ఆధారంగా వచ్చిన 'త్రీ ఇడియట్స్'ను తమిళంలో పునర్నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్, జీవా, శ్రీకాంత్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో ముగ్గురు రాస్కేల్స్ టైటిల్ తో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హ్యారీస్ జై రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఆయన దర్సకత్వంలో వచ్చిన భారతీయుడు, అపరిచితుడు చిత్రాలు కూడా అవినీతిని ఎండగడుతూ వచ్చిన చిత్రాలే.


Click it and Unblock the Notifications











