రెహమాన్ ఆస్కార్ విజేత ఎందుకయ్యాడనేది పులి, రోబో పాటలు వింటే తెలుస్తుంది...
'కొమరం పులి" పాటలతో తనేంటో మరోసారి చాటి చెబుతున్న మ్యూజిక్ లెజెండ్ ఎఆర్ రెహమాన్ త్వరలో ఇంకో భారీ సినిమా ఆడియోతో సంచలనం సష్టించేందకు సిద్దమవుతున్నాడు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో" ఆడియో ఈ నెలాఖరుకి విడుదల కానుంది. 'రోబో" పాటలకి సంబంధించి ఫైనల్స్ మిక్స్ మాస్టర్ కాపీ కూడా రెహమాన్ ఇచ్చేశాడట..
'రోబో" పాటలు విన్న శంకర్ ఆనందాన్ని పట్టలేక పోతున్నాడు. ఈ చిత్రం ఎంత గ్రాండ్ గా తెరకెక్కిందో, ఆ బడ్జెట్ కి, ఆ గ్రాండియర్ కి తగ్గట్టుగా రెహమాన్ అద్బుతమైన పాటలు ఇచ్చాడని శంకర్ అంటున్నాడు. 'రోబో" తొలి పాట వింటే రెహమాన్ ఆస్కార్ విజేత ఎందుకయ్యాడనేది బోధపడుతుందని అన్నాడు. 'మా కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ అంచనాలని అందుకున్నాయి. ఎందిరన్(రోబో) కూడా ఖచ్చితంగా ప్రేక్షకాభిమానుల అంచనాలని అందుకుంటుందనే నమ్మకముంది అని శంకర్ చెప్పుకొచ్చాడు.
మరి అంతగా శంకర్ ని ఎక్సయిట్ చేసిన రెహమాన్ పాటలేంటో వినాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. 'రోబో" చివరి పాట చిత్రీకరణ కూడా పూర్తవడంతో టీమ్ అంతా కలిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని మెగా లెవల్లో రిలీజ్ చేయనున్నారు..


Click it and Unblock the Notifications











