Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శంకర్‌కు జక్కన ప్రశ్నల వర్షం.. నేను రాజమౌళికి బిగ్ఫ్యాన్ను.. 3.0 తీస్తాను..
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న 2.0 సినిమా ట్రైలర్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. చెన్నై సత్యం సెంటర్లలో జరిగిన 2..0 ట్రైలర్ రిలీజ్ వేడుకకు రజనీ, శంకర్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భార్య లతతో రజనీ రాగా, శంకర్ తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో వేదిక వద్దకు వచ్చారు. అక్షయ్ కుమార్ రాకతో వేదిక వద్ద అలజడి చోటుచేసుకొన్నది. ఈ వేడుకలో వీడియో సంభాషణలో భాగంగా శంకర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అభినందించారు. ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్న కొన్ని ప్రశ్నలను శంకర్‌కు సంధించారు. రాజమౌళి వేసిన ప్రశ్నలు ఏమిటంటే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు
ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 2.0 ట్రైలర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. 3డీలో రూపొందిన ట్రైలర్ ఎలా ఉంటుందో.. ఏ స్థాయిలో రూపొందించారో నాకు ముందే తెలుసు. ట్రైలర్, సినిమా హిట్ కావాలని నేను శంకర్ ప్రత్యేకంగా విషెష్ చెప్పనక్కర్లేదు అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
భారీ బడ్జెట్ చిత్రంగా తీసే
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూ.500 కోట్ల బడ్జెట్‌తో 2.0 రూపొందించావు. ఈ సినిమా రూపొందించే సమయంలో ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఒత్తిడిని ఎలా అధిగమించారు. రజనీ ఫ్యాన్స్ అంచనాలను ఎలా చేరుకోబోతున్నారు అని శంకర్‌కు రాజమౌళి ప్రశ్నల వర్షం కురిపించారు.
రాజమౌళి బిగ్ ఫ్యాన్‌ను
రాజమౌళికి బిగ్ ఫ్యాన్‌ను. బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఒత్తిడి బాగానే ఉంది. కాకపోతే ప్లానింగ్ అంతా పక్కాగా జరిగింది. నా టీమ్ హ్యాండిల్ చేసిన తీరుతో పని చేయడం చాలా సులభమైంది.
రజనీ ఫ్యాన్స్ అంచనాలకు ధీటుగా
రజనీకాంత్ ఫ్యాన్స్ నుంచి వచ్చే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రజనీ పోషించిన చిట్టి పాత్ర, రోబో పాత్ర, 2.0 సినిమా రజనీకాంత్ ఫ్యాన్స్ అంచనాలకు మంచి ఉంటుంది. ప్రేక్షకులకు తగినట్టుగా రజనీ సార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని ఎస్ రాజమౌళి ప్రశ్నకు శంకర్ సమాధానం ఇచ్చారు.
3.0 చిత్రాన్ని కూడా తీస్తా
రోబో సీక్వెల్‌గా 2.0 త్వరలో విడుదల కాబోతున్నది. ఇక 3.0 కోసం నా మైండ్‌లో చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి. అయితే కథపై పూర్తిగా క్లారిటీ ఏర్పడిన తర్వాత 3.0 రూపొందించే విషయంపై దృష్టిపెడుతాను. 3.0 చిత్రాన్ని కూడా రూపొందిస్తాను అని శంకర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.