శంకర్ 'ఇండియన్ 2' రెమ్యునరేషన్ గొడవ.. ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సింది ఎంత?

దేశం మెచ్చిన దర్శకుడు దర్శకుడు కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా మేకింగ్ విషయంలో అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ 2 సినిమాను ఏ క్షణాన మొదలు పెట్టారో గాని మొదటి నుంచి కూడా ఆ సినిమాకు ఎదో ఒక రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక శంకర్ రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా రొజులుగా ఒక చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటివరకు అతనికి ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సి ఎంత అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 నమ్మకం ఏర్పడడంతో

నమ్మకం ఏర్పడడంతో

శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టు ఇండియన్ 2ను రోబో ముందు నుంచే తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. కానీ సరైన నిర్మాత దొరికిన తరువాతే ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇక 2.ఓ తో లైకా ప్రొడక్షన్ పై నమ్మకం ఏర్పడడంతో వారితోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

ఆ ఎఫెక్ట్ ఇండియన్ 2పై గట్టిగానే పడింది

ఆ ఎఫెక్ట్ ఇండియన్ 2పై గట్టిగానే పడింది

అయితే 2.ఓ ఎఫెక్ట్ ఇండియన్ 2పై గట్టిగానే పడింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలన శంకర్ ఇండియన్ 2 సినిమాపై లైకా వారు అనుకున్నంత బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అది కూడా సినిమా షూటింగ్ సగం అయిపోయిన తరువాత దర్శకుడికి బడ్జెట్ విషయంలో అభ్యంతరం చెప్పారు.

 ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో

ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో

ఇక ఆ తరువాత యాక్సిడెంట్ అవ్వడం, కోవిడ్ రావడం వలన సినిమా షూటింగ్ కు మరింత గ్యాప్ వచ్చింది. ఇక లైకా వారు షూటింగ్ విషయంలో అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో శంకర్ మరొక ప్రాజెక్టును స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు. ఇక లైకా వెంటనే కోర్టును ఆశ్రయించించిన విషయం తెలిసిందే.

శంకర్ రెమ్యూనరేషన్ ఎంత?

శంకర్ రెమ్యూనరేషన్ ఎంత?

ఇక సినిమా కోసం మొదట 150కోట్లు అనుకున్నారు. ఇక ఆ తరువాత ఆ లెక్క 236కోట్లకు. వెళ్లింది. ఇప్పటికే 180కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే శంకర్ కు మొత్తం ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ 40కోట్లు. ఇక ముందుగానే 15కోట్ల వరకు ఇచ్చారు. మిగిలిన ఎమౌంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.

Recommended Video

Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
 లైకా కండిషన్ పెట్టింది.

లైకా కండిషన్ పెట్టింది.

ఫైనల్ గా శంకర్ ఇప్పుడు ఇండియన్ 2ని పూర్తి చేసిన తరువాతే మరొక సినిమాను పూర్తి చేయాలని లైకా కండిషన్ పెట్టింది. రెమ్యునరేషన్ విషయంలో లెక్క తెలనిదే శంకర్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేడని టాక్ అయితే వస్తోంది. ఇక మద్రాస్ కోర్టు కూడా ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని ఇటీవల కేసును వాయిదా వేసింది. మరి శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X