కమల్ హాసన్‌ని అలా చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. శంకర్!

శంకర్ తెరకెక్కించిన 2.0 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 2.0 కోసం శంకర్ దాదాపు 3 ఏళ్ళు కష్టపడ్డాడు. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ కీలకమైన చిత్రం కావడంతో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఆలస్యమైనా శంకర్ ఓ అద్భుత చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఇలా 2.0 రిలీజ్ అయ్యిందోలేదో అప్పుడే శంకర్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. లోక నాయకుడు కమల్ హాసన్ తో శంకర్ భారతీయుడు 2 తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.

ఆలస్యం చేయకుండా

ఆలస్యం చేయకుండా

2.0 లాంటి ప్రపంచ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత శంకర్ ఏమాత్రం విశ్రాంతి తీసుకునేలా కనిపించడం లేదు. వెంటనే మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. అతి త్వరలో లోక నాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. కథ సిద్ధం చేసిన శంకర్ ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. డిసెంబర్ 14 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

 నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి

నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ భారతీయుడు 2 చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. ఇటీవల కమల్ హాసన్ కు భారతీయుడు 2 కోసం లుక్ టెస్ట్ చేశాం. దాదాపు 22 ఏళ్ల తరువాత కమల్ ని అలా వృద్ధుడి లుక్ లో చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చాలా గొప్ప అనుభూతి కలిగింది. దర్శకుడైన నాకే ఇలా ఉంటే.. అభిమానులకు ఎలా ఉంటుందో ఊహించుకోగలను.

ఇప్పటికీ అదే ఎనర్జీ

ఇప్పటికీ అదే ఎనర్జీ

భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రకు చాలా మంది అభిమానులు ఉన్నారు. 22 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రం వచ్చింది. ఇప్పటికీ కమల్ హాసన్ అదే ఎనర్జీతో ఉన్నారు. లుక్ టెస్ట్ జరిగిన రోజు మేమంతా కమల్ ని అలాగే చూస్తూ ఉండిపోయాం అని శంకర్ అన్నారు.

భారతీయుడు 2 కథ

భారతీయుడు 2 కథ

భారతీయుడు 2 కథకు సంబంధించి కూడా శంకర్ కొన్ని విషయాలు తెలియజేశాడు. తాను అప్పటివరకు అనుభవించిన సంఘటనలు, కళ్లారా చూసిన దృశ్యాల ఆధారంగా భారతీయుడు చిత్రాన్ని రూపొందించా. భారతీయుడు 2 కథ రాయడానికి కూడా కొన్ని బలమైన సంఘటనలు కారణమయ్యాయి. ఈ మధ్యకాలంలో నన్ను పదే పదే ఆలోచింపజేసిన అంశాలు భారతీయుడు 2లో భాగం కానున్నాయి అని శంకర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X