శంకర్ సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ఎన్టీఆర్, సూర్య భారీ సినిమాలు.. అసలు మేటర్ ఏమిటంటే?

ఇప్పుడంటే ప్రతి భాషకి చెందిన ఇండస్ట్రీలో కూడా టాలెంట్ ఉన్నా లేకపోయినా చాలా మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారు కానీ అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఇలా చేయాలి అని చూపించిన వన్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ది గ్రేట్ శంకర్ అనే చెప్పొచ్చు. ఎపుడో 1990 ల టైం లోనే ఒక సినిమాకి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసే క్రమంలో ఆ భాషలకి తగ్గట్టుగా నటీనటుల్ని మార్చి సినిమాలు తీసేవారు విజనరీ డైరెక్టర్ శంకర్.

అలాగే తన విజన్ కి హాలీవుడ్ సినిమా దర్శకులు సైతం ఆశ్చర్యపడ్డారు. అలాంటి శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేరు కానీ తాను హిట్ కొడితే ఎలా ఉంటుందో తన సినిమాల తాలూకా గ్రాండియర్ ఏపాటిదో అందరికీ తెలుసు. అయితే శంకర్ దర్శకుడిగా తన మార్క్ విజన్ తో గ్రాండ్ ఎపిసోడ్స్ తో సినిమాల్లో చూపించారు. అయితే శంకర్ తమిళ్ లో ఒక ఫేమస్ నవల ఆధారంగా ఎప్పటి నుంచో ఓ భారీ చిత్రాన్ని అది కూడా నీటి నేపథ్యంలో తీస్తారని ఆ మధ్య అంతా ఓ టాక్ అయితే బాగా నడిచింది.

shankar latest post makes controversy with devara and kanguva

కాగా ఇపుడు శంకర్ వేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తమిళ్ ప్రముఖ నవల "వీర యుగ నాయగన్ వేల్ పారి", సు వెంకటేశన్ రాసిన ఈ నవల తాలూకా కాపీ రైట్స్ నా దగ్గర ఉన్నాయి అని, కానీ ఈ ఉండే ఎన్నో సీన్స్ ని కొందరు చాలా సినిమాల్లో అనుమతి లేకుండా పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ఓ సినిమా ట్రైలర్ లో కూడా తన నవలలో ఉండే తరహా సీన్స్ ఉన్నాయి అంటూ శంకర్ షాకిచ్చారు.

దీనితో రీసెంట్ గా వచ్చిన ట్రైలర్లు అంటే ఫ్రెష్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "దేవర" ట్రైలర్స్ అలాగే సూర్య నటించిన భారీ చిత్రం "కంగువా" సినిమాల ట్రైలర్లే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో నీటి నేపథ్యం అంటే ఎక్కువగా దేవర కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. దీనితో శంకర్ పెట్టిన సంచలన పోస్ట్ ఇప్పుడు చర్చకి దారి తీసింది.

ఈ నవలలో కీలకమైన సన్నివేశాలని నా అనుమతి లేకుండా క్రియేటర్స్ ఎలాంటి క్రెడిట్స్ లేకుండా తీసుకుంటున్నారు అని క్రియేటర్స్ హక్కులకు గౌరవం ఇవ్వండి అనుమతి లేని సన్నివేశాలు, అడాప్ట్ చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి అని లేదా లీగల్ యాక్షన్ కి సిద్ధంగా ఉండండి అంటూ శంకర్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఇది అందరిలో షాకింగ్ గా మారింది.

అయితే ఇదంతా దేవర రెండో ట్రైలర్ వచ్చిన తర్వాతే పెట్టడం మరో ట్విస్ట్ అని చెప్పాలి. ఇంకో పక్క కంగువా లో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో పలు సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. దీనితో శంకర్ వేసిన ట్వీట్ తర్వాత ఈ రెండు భారీ సినిమాలే ప్రధాన హైలైట్ గా వినిపిస్తున్నాయి. మరి శంకర్ చెప్పిన ఆ "రీసెంట్ ట్రైలర్" ఏ సినిమాకి సంబంధించినది అనేది మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: shankar devara jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X