twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత, శంకర్ మధ్య బిగ్‌ఫైట్.. రోబో2 రిలీజ్ ఎప్పుడో.. దేవుడికే ఎరుక

    By Rajababu
    |

    సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రోబో2.0 చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ తదితరులు నటిస్తున్నారు. అయితే రోబో2.0 చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్ర విడుదల తేదీపై శంకర్, లైకా ప్రొడక్షన్ మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగిందట. వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Rajinikanth's Robo 2.0 Audio Launch Date Is Out ఖర్చు తెలిస్తే షాకవుతారు!
    వీఎఫ్‌ఎక్స్ కంపెనీ దివాళా

    వీఎఫ్‌ఎక్స్ కంపెనీ దివాళా

    రోబో2.0 చిత్రానికి వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్న అమెరికా కంపెనీ ప్రస్తుతం దివాళా తీయడంతో ఈ చిత్రం విడుదల మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో సమ్మర్ రేసు నుంచి ఈ సినిమా తప్పుకొన్నట్టు తెలిసింది. దాని స్థానంలో రజనీకాంత్ కాలాను విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    రోబో2 పలుమార్లు వాయిదా

    రోబో2 పలుమార్లు వాయిదా

    రోబో2.0 చిత్రం తొలుత దసరాకు విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 26 తేదీకి వాయిదా పడినట్టు లైకా ప్రొడక్షన్ ప్రకటించింది. అలా ఈ చిత్ర విడుదల అనేకమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకులను, అభిమానులను విసిగిస్తున్నది. అయితే విడుదల జాప్యానికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడమే అని వివరణ ఇచ్చింది.

    నష్టాల్లో లైకా ప్రొడక్షన్

    నష్టాల్లో లైకా ప్రొడక్షన్

    వాస్తవానికి రోబో2.0 చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్ భావించింది. కానీ వాయిదాల మీద వాయిదా పడుతుండటం వలన తీవ్ర నష్టానికి గురికావాల్సి వస్తుందనే వాదనను దర్శకుడు శంకర్‌కు నిర్మాత వినిపించాడట. అయితే సినిమా అత్యంత సాంకేతికతతో రూపొందుతున్నందున నాణ్యత విషయంలో రాజీ పడని శంకర్ తేల్చి చెప్పాడట.

    శంకర్‌పై గుర్రుగా లైకా

    శంకర్‌పై గుర్రుగా లైకా

    రోబో2.0 రిలీజ్ విషయంపై శంకర్ తేల్చి చెప్పకపోవడంతో లైకా ప్రొడక్షన్ నిర్వాహకులు మనస్తాపానికి గురైనట్టు సమాచారం. అయితే రిలీజ్ విషయంపై ఖరాఖండీగా ఓ తేదీని నిర్ణయించాలని సూచించడంతో శంకర్‌కు నిర్మాతలకు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తున్నది.

    రోబో2 రిలీజ్ డేట్ ఎప్పుడు

    రోబో2 రిలీజ్ డేట్ ఎప్పుడు

    రోబో2.0 చిత్రం కోసం పలు దేశాల్లోని ప్రముఖ గ్రాఫిక్స్ కంపెనీలతో వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దాంతో రోబో2.0 సినిమా విడుదల అనేక మార్లు వాయిదా పడుతూ వస్తున్నది. ఇలా వాయిదాలు పడుతున్న 2.0 ఎప్పుడు రిలీజ్ అవుతుందో దేవుడికే ఎరుక అనే మాట వినిపిస్తున్నది.

    విభేదాలకు చెక్ పెట్టేందుకు

    విభేదాలకు చెక్ పెట్టేందుకు

    ప్రస్తుతం తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి రోబో2.0 త్వరితగతిన విడుదల చేసేలా ప్రయత్నించాలని అటు శంకర్, ఇటూ లైకా ప్రోడక్షన్‌కు వారి వారి సన్నిహితులు వెల్లడిస్తున్నారట. దాంతో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఓ డేట్‌ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నది తాజా సమాచారం.

    400 కోట్లతో రోబో2

    400 కోట్లతో రోబో2

    బాహుబలి తర్వాత దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్‌గా రోబో2.0 తెరకెక్కింది. సుమారు రూ.400 కోట్లతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తున్నది.

    English summary
    Rajinikanth's mega-budget film 2.0 with director Shankar is one of the most anticipated films of the year. The team has been letting Rajini's fans down by postponing the release multiple times. Now, reports say that director Shankar and producers Lyca Productions had a major tussle over the delay of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X