బడ్జెట్ 100 కోట్ల లోపే అని తేల్చి చెప్పిన దర్శకుడు
ఇప్పటికే ఈచిత్రం తొలి షెడ్యూల్ చెన్నయ్ ప్రాంతంలో చిత్రీకరించారు. సినిమా గ్రాండ్‌గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన 'జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్‌లో చిత్రీకరణ జరుపి ప్రేక్షకులకు కనువిందు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
అమీ జాక్స్‌ను ఈచిత్రంలో విక్రమ్ సరసన హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.
'మెన్ ఇన్ బ్లాక్' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












