త్రీ ఇడియట్స్ కి టాలీవుడ్ లో ఆటంకం..!?
నన్బన్ చిత్రం సంక్రాతికి సిద్ధమవుతోంది. విజయ్, జీవా, శ్రీకాంత్, సత్యరాజ్, ఎస్ జె సూర్య, లారెన్స్, ఇలియానా, మొదలగు పలువురు నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం నన్బన్. స్టార్ డెరైక్టర్ శంకర్ తనదైన స్టైల్‌లో సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్న చిత్రం నన్బన్. ఈ చిత్రం నూరు శాతం పూర్తిఅయిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాటను ఐదు రోజుల క్రితం చెన్నైలో విజయ్, ఇలియానాలపై చిత్రీకరించారు. హారిష్ జయరాజ్ సంగీంతం అదిస్తున్న ఈ చిత్రం ఆడియో నవంబర్ నెలాఖరున, చిత్రాన్ని పొంగల్‌కు విడుదల చేయనున్నట్లు జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.
అయితే పండగలప్పుడు డబ్బింగ్ సినిమాలను రిలీజ్ అవ్వనివ్వకూడదనే కండిషన్ పెట్టాలని మన తెలుగు పరిశ్రమవారు అనుకుంటున్నారు. జనవరి 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకు రావాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే రోబో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నతాజా చిత్రం 'నన్బన్"కి ఆటకం ఏర్పడుతుందని ఊహించవచ్చు.
ఇడియట్స్ ని తెలుగు, తమిళ భాషలో శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోకి '3 రాస్సెల్స్" పేరిట అనువదించి వచ్చ సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. పండగలప్పుడు డబ్బింగ్ సినిమాలు విడుదల కాకుడదనుకుంటున్నారు కాబట్టి '3 రాస్కెల్స్ "విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఊహించవచ్చు.


Click it and Unblock the Notifications











