మెగా దర్శకుడు శంకర్ డైరక్టర్ గానే కాక నిర్మాతగానూ విభిన్నమైన చిత్రాలు తీసి హిట్ కొట్టడం తెలిసిందే. తాజాగా ఆయన Anadha Purathu Veedu అనే థ్రిల్లర్ సినిమాను నిర్మిస్తున్నారు. మర్మదేశం వంటి టీవి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నాగ అనే తమిళ దర్శకుడు ఈ చిత్తాన్ని రూపొందిస్తున్నాడు. ఇక ఆయన టివి పరిశ్రమలో విపరీతంగా టీఆర్ పి లు ఎలా పెంచారో అలాగే సిని పరిశ్రమలోను అంతకుమించి హిట్ చిత్రాన్ని అందిస్తారని శంకర్ ఓపినింగ్ సందర్భంగా చెప్పటం జరిగింది. ఇక ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభమయింది.నంద,ఛాయాసింగ్ ప్రధాన పాత్రధారులుగా చేస్తున్న ఈ సినిమా తర్వాత కేరళ అడవుల్లో కూడా షూటింగ్ జరపటానికి ప్లాన్ చేస్తున్నారు. భవాని శంకర్ ఆర్ట్ డైరక్షన్ చేస్తూంటే..అరుణ్ మణి పళణి కెమెరా వర్క్ హ్యాండిల్ చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ నాగ.
Story first published: Thursday, November 13, 2008, 11:35 [IST]