'ఈగ'సినిమా పై 'రోబో'శంకర్ స్పందన
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' విడుదలైన నాటి నుంచీ మీడియాలో ఈ చిత్రాన్ని శంకర్ చిత్రం రోబో తో పోలుస్తూ కథనాలు వస్తున్నాయి. ఈ నేఫధ్యంలో శంకర్ ..ఈ ఈగ చిత్రాన్ని చూసి స్పందించిన విషయం మీడియాలో హైలెట్ అయ్యింది. శంకర్ ఈ చిత్రం తమిళ వెర్షన్ ని చెన్నై దేవి సినీ ప్లెక్స్ లో ఆదివారం(జూలై 8) చూసారు. ఆయన ఈ చిత్రంలో రాజమౌళి వర్క్ కు చాలా ఇంప్రెస్ అయ్యారు.
ఆయన ఆ ధియోటర్ లో ఉన్న విజిటర్స్ బుక్ లో ఈ చిత్రం గురించి ఓ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ లో..సూపర్ ఫిల్మ్ అని రాసారు. హాలీవుడ్ స్టాండర్డ్ లో రోబో చిత్రం తీసిన శంకర్ తన చిత్రం మొచ్చుకోవటం చూసి రాజమౌళి, ఆయన టీమ్ చాలా ఆనందపడ్డారు. తమిళ ఈగ చిత్రాన్ని పివిఆర్ సినిమా వారు విడుదల చేసారు. చెన్నైలో రిలీజైన రోజు నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ లో ఆడుతోంది.
'ఈగ'మొన్న శుక్రవారం భారీ ఎత్తున విడుదల అయ్యి మార్నింగ్ షో కే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి ని సిని పరిశ్రమ అభినందనలతో ముంచెత్తుతోంది. తాజాగా మహేష్ బాబు ఈగ చిత్రం చూసి సినిమా గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ...ఈగ తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన గ్రేట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలుస్తుంది. రాజమౌళి గారికి, ఈగ టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్...ముఖ్యంగా సుదీప్ ఫెరఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్...అని మూడు వాక్యాల్లో తన స్పందనను తెలియచేసారు మహేష్ బాబు.


Click it and Unblock the Notifications











