ఎప్పుడెప్పుడా అని అని ఎదురుచూసిన రజనీకాంత్ "కథానాయకుడు" నిన్న ప్రేక్షకులముందుకు వచ్చింది.ఇక ఇప్పుడు అందరి దృష్టి 'రొబొ' మీదే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల (ఆగస్టు) 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.ఇక ఈ సినిమాను తమిళ,తెలుగు సినీ ప్రేక్షకుల కోసమే కాకుండా ప్రపంచ మార్కెట్ లో విడుదల చేసి సంచలనం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే నిన్న (ఆగస్టు ఒకటో తేదీన) ప్రపంచ వ్యాప్తంగా "కథానాయకుడు" విడుదలను పురస్కరించుకుని యూఎస్‌లో రజనీ అభిమానులు థియేటర్ల ముందు భారీ కట్‌అవుట్లు, పోస్టర్ల ఏర్పాటు చేసి పండుగ చేసుకుంటున్నారు. అదేవిధంగా "రోబో" షూటింగ్ ప్రారంభం కాక ముందే రజనీ అభిమానులు ఆ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.