Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమిళ రాకర్స్‌తో 2.O వార్: పైరసీపై ఉక్కుపాదం.. బ్లాక్ లిస్టులో 12 వేల వెబ్సైట్లు!
భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించే రీతిలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 మూవీపై భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రాన్ని పైరసీ చేస్తామని తమిళ రాకర్స్ లాంటి వెబ్సైట్లు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్ భారీగా చర్యలు తీసుకొంటున్నది. 2.O చిత్రాన్ని పైరసీకి చిక్కకుండా భారీ రేంజ్లో ప్రయత్నిస్తున్నారు. లైకా ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే వేచి చూడాల్సిందే. లైకా తీసుకొంటున్న చర్యలు ఇవే
పైరసీకి గురికాకుండా పోరాటం
రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం పైరసీ గురికాకుండా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా పోస్ట్ చేసే డౌన్ లోడింగ్ లింకులపై ఉక్కుపాదం మోపేందుకు అనుమతి తీసుకొన్నారు. దాదాపు 12 వేల వెబ్సైట్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలో పైరసీ కాకుండా తగుజాగ్రత్తలు తీసుకొంటున్నారు.
10 మందితో బలమైన టీమ్
2.0 సినిమాను పైరసీకి గురికాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకొంటున్నాం. పది మందితో బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నామో మేము బయటికి వెల్లడించలేం. గుట్టు చప్పుడు కాకుండా మా బృందం పనిచేస్తున్నది అని లైకా ప్రొడక్షన్ సభ్యుడు వెల్లడించారు.
చెన్నై, ఢిల్లీ నగరాల్లో టీమ్‌లు
పైరసీని అడ్డుకునేందుకు చెన్నై, ఢిల్లీలో ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేశాం. పైరసీ లింకులు కనిపిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేస్తాం. థియేటర్లలో కొంత మంది సిబ్బందిని కూడా పెడుతున్నాం. మా పరిధిలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని లైకా ప్రొడక్షన్ వెల్లడించింది.
తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌కు సవాల్
2.0 సినిమా రిలీజ్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తమిళ రాకర్స్ ట్విట్టర్లో సంచలన పోస్టును పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే 2.0 చిత్రాన్ని తమిళ రాకర్స్ పైరసీ వెబ్సైట్లో రిలీజ్ చేయనున్నామని లైకా ప్రొడక్షన్‌కు ఝలక్ ఇచ్చింది. దీంతో లైకా ఓ సవాల్‌గా గట్టి చర్యలు తీసుకొంటున్నది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం రిలీజ్‌కు ముందే పూర్తి సినిమా పైరసీ వెబ్సైట్లలో దర్శనమివ్వడం తెలిసిందే.