వైభవంగా క్రికెటర్ తో శంకర్ కూతురి పెళ్లి.. హాజరయిన సీఎం, ఫోటోలు వైరల్ !

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. మొట్టమొదటిసారి సౌత్ సినిమాకి కూడా హాలీవుడ్తో పోటీపడగా సత్తా ఉందని ఆయన చేసిన రోబో లాంటి సినిమాలతో నిరూపించాడు.. ఈ రోజు ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. ఆ వివాహానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు ఆ వివరాల్లోకి వెళితే

అంగరంగ వైభవంగా ఐశ్వ‌ర్య‌ శంకర్ పెళ్లి

అంగరంగ వైభవంగా ఐశ్వ‌ర్య‌ శంకర్ పెళ్లి

గత కొద్ది రోజులుగా డైరెక్టర్ శంకర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.కమల్ హాసన్ సినిమా షూటింగ్ లో ప్రమాదం మొదలు ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. శంకర్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌ శంకర్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శంకర్ కూతురు ఐశ్వ‌ర్య ఒక డాక్ట‌ర్‌ కాగా ఆమె భ‌ర్త ఒక క్రికెట‌ర్.

మధురై పాంథర్స్ టీమ్‌కి కెప్టెన్

మధురై పాంథర్స్ టీమ్‌కి కెప్టెన్

శంకర్ అల్లుడు త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌, మధురై పాంథర్స్ టీమ్‌కి కెప్టెన్ కూడా. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక శంకర్ కుమార్తె వివాహ వేడుక మహాబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని వెల్‌కమ్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

 మహాబలిపురంలో

మహాబలిపురంలో

అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అతికొద్ది మంది సన్నిహితులతోనే ఈ వివాహ వేడుక పూర్తి చేశారు. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. మహాబలిపురంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని వెల్‌కమ్ హోటల్‌లో ఈ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది.

ఆర్ట్ డైరెక్టర్ ముత్తు రాజ్ చేతుల్లో

ఆర్ట్ డైరెక్టర్ ముత్తు రాజ్ చేతుల్లో

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వివాహానికి సెట్‌ను అవార్డు గ్రహీత ఆర్ట్ డైరెక్టర్ ముత్తు రాజ్ రూపొందించారు. ఆయన శంకర్‌తో కలిసి ఐ, 2.0, సినిమాలకు పని చేయగా ఇండియన్ 2 సినిమాకు పని చేస్తున్నారు. ఇక దామోదరన్ మరియు పద్మ - చాలా దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గెస్ట్ లిస్ట్ 50కి పరిమితం చేశారు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

వివాహానికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు హాజరయినా కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరు కావడం వల్ల నూతన వధూవరులకు అదనపు ప్రత్యేకత లభించినట్లు అయింది. ఇక వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్. ఇక శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 తెరకెక్కించనుండగా అది వివాదాలలో చుక్కుకుంది. దీంతో రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమాతో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X