పార్టీలో మునిగి తేలిన శంకర్ ‘ఐ’ యూనిట్
చెన్నై: దాదాపు 2 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకున్న ‘ఐ' చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. బుధవారం(సెప్టెంబర్ 24) షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ సభ్యులంతా కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. చెన్నైలోని పార్క్ హయత్‌లో నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ పార్టీ ఏర్పాటు చేసారు.
ఇటీవల చెన్నైలో జరిగిన ‘ఐ' మూవీ తమిళ వెర్షన్ ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ హాజరైన సంగతి తెలిసిందే. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియో వేడుక కూడా విడుదల కాబోతోంది. హైదరాబాద్ లో జరిగే తెలుగు వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకకు జాకీ ఛాన్ హాజరవ్వబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మరికొందరు తెలుగు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 22 న ‘ఐ' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారిగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2న ఆడియో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.


Click it and Unblock the Notifications











