సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్న శంకర్.. భారీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరెవరంటే!

Recommended Video

Shankar's Big Multistarrer With Kollywood Star Heroes || Filmibeat Telugu

భారత దేశ దిగ్గజ దర్శకుల్లో శంకర్ ఒకరు. తాను తెరకెక్కించే ప్రతి చిత్రం ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి అందించే విధంగా ఉండాలని కష్టపడుతుంటారు. శంకర్ దర్శకత్వంలో ఇప్పటివరకు ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు వచ్చాయి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన రోబో చిత్రం తర్వాత శంకర్ స్థాయికి తగ్గ చిత్రాలు రాలేదనే చెప్పాలి. ఐ, 2.0 లాంటి చిత్రాలు అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. శంకర్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఆగిపోయిందంటూ

ఆగిపోయిందంటూ

2.0 చిత్రం తర్వాత శంకర్ భారతీయుడు 2 చిత్రాన్ని ప్రారంభించారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించాల్సింది. కానీ అనుకోని కారణాలవలన భారతీయుడు ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ నుంచి కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి.

భారీ మల్టీస్టారర్

భారీ మల్టీస్టారర్

మల్టీస్టారర్ చిత్రాలపై అభిమానులకు ఎపప్పుడూ ఆసక్తి ఉంటుంది. శంకర్ త్వరలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇళయదళపతి విజయ్, చియాన్ విక్రమ్ హీరోలుగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శంకర్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథని సిద్ధం చేస్తున్నారట. శంకర్ ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన భారీ బడ్జెట్ లో ఉంటుంది. అలాంటి ఓ మల్టీస్టారర్ చిత్రానికి ఇంకెంత బడ్జెట్ వెచ్చిస్తారో అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో

ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో

చియాన్ విక్రమ్, విజయ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో నటించారు. శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం అపరిచితుడు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఐ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. విజయ్ కూడా స్నేహితుడు చిత్రంలో శంకర్ దర్శకత్వంలో నటించాడు. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు ఓ చిత్రం కోసం చేతులు కలిపితే అది సౌత్ లో తప్పకుండా సంచలనమే అవుతుంది.

సత్తా నిరూపించుకోవాలని

సత్తా నిరూపించుకోవాలని

విజయ్, విక్రమ్, శంకర్ సినిమా గురించ్చి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓ అద్భుతమైన చిత్రంతో తిరిగి తన సత్తా నిరూపించుకోవాలని శంకర్ భావిస్తున్నారు. 2.0 తర్వాత శంకర్ తెరకెక్కించాలనుకున్న భారతీయుడు 2 చిత్రం నిర్మాణ సంస్థతో విభేదాల వల్ల ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X