హాట్ న్యూస్ :శంకర్,విక్రమ్ చిత్రం ‘ఐ’ స్టోరీ లీక్
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశంతో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. సంగీతం: ఏఆర్ రెహమాన్. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.


Click it and Unblock the Notifications












