రొబో గురించి శంకర్

అయితే అంతకంటే భిన్నంగా ఈ చిత్రంలో స్టైల్స్, మేనజంలు ఉంటాయిని అబిమానులకు హామీ ఇస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ ఏమీ లేదు. కథలోనే హాస్యం ఇమిడిపోయి ఉంటుంది. శివాజి చిత్రంలో లాగే ఈ చిత్రంలోనూ ఓ అల్ట్రా మోడ్రన్ సాంగ్ ఉంటుంది. ఇక ఐశ్వర్యారాయ్ నా జీన్స్ చిత్రంలో కన్నా అందంగా ఉంటుంది. చివర్లో మీడియోవారు ఇప్పటికే ఈ చిత్రం కథ ఫలనా అంటూ కథనాలు రావటం ప్రస్ధావిస్తే అవును అనలేదు..కాదనలేదు.నవ్వి ఊరుకున్నారు.
ప్రచారంలో ఉన్న కథ...రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా శంకర్ రూపొందిస్తున్న రొబొ(Endhiran) సినిమా గురించి కొంత విశ్వసనీయ సమాచారం బయిటకు వచ్చింది. వాటిని బట్టి ఈ సినిమాలో రజనీకాంత్ డబుల్ (సైంటిస్ట్, రొబొ) పాత్రలలో కనపడనున్నారు. ఈ సినిమా కథ మొత్తం రొబొ తయారు చేయటానికి రజనీకాంత్ ని ఏ పరిస్ధితులు ప్రేరేపించాయి..తయారైన రొబో తో ఏ అనుబంధం పెంచుకుంటాడు..ఆ రొబో తో అతనేం సాధించాడు అన్న కోణంలో సాగుతుంది.
కధ మొత్తం 2200 AD లో జరుగుతుంది.అప్పుడు రజనీకాంత్ ఓ ఫేమస్ సైంటిస్టు. ఐశ్వర్యారాయ్ తో పిచ్చి ప్రేమలో ఉంటాడు. బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ పొందిన అతనికి ప్రభుత్వం ఓ ముఖ్యమైన పని అప్పచెబుతుంది. మానవ జీవితాన్నీ సౌకర్యవంతం చేయటానికి అవసరమైన రొబొలను తయారు చేయమని ఆదేశిస్తుంది. అయితే అసలు సమస్యంతా రజనీ..రొబో తయారు చేయటంతో వస్తుంది. అక్కడ నుండి కథ కొన్ని ఆసక్తి కరమైన మలుపులు తిరుగుతుంది.
ఇక కథలో ముఖ్యమైన మలుపు విలన్ పాత్రతో వస్తుంది. సైంటిస్ట్ రజనీ పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక విలన్ ఆ తయారైన రొబొకి కొన్ని ముఖ్యమైన ప్రేమకు సంభందించిన పాస్ వర్డ్ మార్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దాంతో ఆ రొబో తను తయారు అయిన కారణం వదిలేసి హీరోయిన్ తో ప్రేమలో పడుతుంది. అక్కడనుండి అది ఐశ్వర్య వెనుక పడుతూ సమస్యలు క్రియేట్ చేస్తుంది. చివరకు రజనీ తిరిగి ఎలా ఆ రొబో ను కంట్రోల్ లోకి తెచ్చుకుని తన ప్రేయసి ని కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











