'రోబో' కోసం శంకర్ పాట్లు

'శివాజీ' సెట్స్ వద్దకు బయటి వ్యక్తుల్ని ఎవరినీ రానీయకుండా గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసినా దాని స్టిల్స్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దాంతో ఆయన ఇప్పుడు చాలా భయపడుతున్నాడు. అంతేగాక 'రొబో' కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి శంకర్ కొన్ని కంప్యూటర్లను తెప్పించాడు. సినిమాలో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ మొత్తం ఈ కంప్యూటర్ల ద్వారా జరుపుతారు. లీకేజ్ విషయాన్ని దృష్టిలో వుంచుకుని ఈ కంప్యూటర్లను చెన్నైలోని జెమిని ల్యాబ్‌లో ఎవరికీ తెలీని ప్రదేశంలో వుంచి, అక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ పనుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతలోనూ గట్టి సెక్యూరిటీని నియమించారు. ఇక జూన్‌లో 'రోబో' సెట్స్ మీదకు వెళ్లనుండగా, ప్రస్తుతం రజనీకాంత్ 'కుచేలుడు'లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











