'కాంచన'పై కుట్ర అంటూ గోల
నా సినిమాలు తమిళనాడులో విడుదల కాకుండా కుట్ర జరిగింది. శరత్‌కుమార్ సినిమా అనగానే థియేటర్లు లేకుండా చేశారు. ఆ కారణంగా చాలా నష్టపోయాం అంటూ వాపోయారు తమిళ నటుడు శరత్ కుమార్.ఆయన రీసెంట్ గా విడుదలైన 'కాంచన' చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శరత్‌కుమార్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే
'జగ్గూభాయ్' సినిమా విడుదలకు ముందే ప్రింటు బయటకు వచ్చేసింది. అదెలా వచ్చిందో ఇంత వరకూ తెలీదు.తమిళంలో అందుకే సినిమాలు తగ్గించాను అన్నారాయన.
ఇక 'కాంచన' గురించి చెబుతూ ''ఇప్పటి వరకూ వందకు పైగా సినిమాలు చేశాను. హీరోగా, విలన్ గానూ నటించాను. మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలు చేయడం నాకే నచ్చడం లేదు. వైవిధ్యభరితమైన పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను. లారెన్స్ వచ్చి 'కాంచన' పాత్ర గురించి నాకు చెప్పగానే ఇదో సవాల్‌గా అనిపించింది. పైగా మంచి సందేశం ఇవ్వాలనుకొన్నారు. అందుకే నటించాను. ఎప్పుడూ ఇన్ని ప్రశంసలు దక్కలేదు అని మురసిపోతూ చెప్పారు.


Click it and Unblock the Notifications











