అక్కడ మహేష్ బాబు...శర్వానంద్
ఇప్పుడు తమిళంలో హాట్ టాపిక్ ఏమిటా అంటే శర్వానంద్ నటించిన తాజా చిత్రం న 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' కలెక్షన్స్. ఆ చిత్రం దాదాపు నలభై కోట్లు వరకూ కలెక్టు చేసిందని,అదీ ముప్పై రోజుల్లో చెప్పుకుంటున్నారు. దాదాపు 150 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుని,మెల్లిగా సూపర్ హిట్ రేంజికి చేరుకుంది.తెలుగులో సూపర్ హిట్ దూకుడులాగానే అక్కడ కూడా ఈ చిత్రం కలెక్షన్స్ గురించే మీడియోలో భారీ ఎత్తున చర్చ.అలాగే ఈ చిత్రం కేవలం నామమాత్ర బడ్జెట్ అంటే ఐదు కోట్లలో నిర్మించారు.కేవలం పదిహేను కోట్లు మాత్రమే వస్తాయని ఎక్సపెక్ట్ చేసారు.కానీ అందరి అంచనాలను తారుమారిచేసి రికార్డులు సృష్టిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని తెలుగులో జర్నీ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. గజనీ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న దర్సకుడు మురదాస్ తాజా చిత్రం 'జర్నీ' . అయితే ఈ చిత్రానికి దర్శకుడు కాదు మురగదాస్..ఆయన నిర్మాత మాత్రమే. మురుగదాస్ నిర్మాతగా హాలీవుడ్ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి తెలుగులోకి అనువదిస్తున్న సంగతి విదితమే.
శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'జర్నీ' అనే పేరు నిర్ణయించినట్లు సురేష్ కొండేటి తెలిపారు. ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ 'తమిళంలో నేను నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది. కథకు తగ్గట్లుగా తెలుగులో 'జర్నీ' అనే పేరు నిర్ణయించాం' అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ 'గజని, స్టాలిన్ వంటి పవర్‌ఫుల్ చిత్రాలను రూపొందించిన మురుగదాస్ నిర్మించిన తొలి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. 'గమ్యం', 'ప్రస్థానం' సినిమాల తరువాత మళ్లీ అతనికి అంత పేరు తెచ్చే సినిమా ఇది. రెండు జంటలమధ్య సాగే రెండు ప్రేమకథలతో ఈ సినిమా ఉంటుంది. విడివిడిగా సాగే ఈ కథలకు క్లైమాక్స్ సీన్స్ లో లింక్ ఉంటుంది. ఈ వారంలోడబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో పాటలు కూడా బాగా వచ్చాయి' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సిహెచ్.ప్రద్యుమ్న, సంగీతం: సత్య, ఫొటోగ్రఫీ: వేల్‌రాజ్, సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: శరవణన్. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'సెవెన్త్‌సెన్స్" చిత్రం రూపొంది విడుదలకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











