కోలీవుడ్ ని ఇంప్రెస్ చేసిన తెలుగు హీరో...?!
వెన్నెల, గమ్యం, ప్రస్థానం, అందరి బంధువయ సినిమాలతో తెలుగులో తనకంటూ మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు తమిళంలో దూసుకుపోతున్నాడు. 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్" సినిమా ఇప్పుడు తమిళంలో ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సినిమా(గజిని)దర్శకుడు మురగదాస్ నిర్మాతగా మారి, శరవణన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం టాక్ అఫ్ ది సౌత్ ఇండియా. ప్రస్థానం తర్వాత శర్వానంద్‌కి ఇది మరో మంచి సినిమాగా నిలుస్తుంది.
ఈ సినిమా విజయంతో శర్వానంద్ కి పెద్ద తమిళ డైరెక్టర్ ల నుండి అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఈ సినిమా విజయం మీద శర్వానంద్ మాట్లాడుతూ, ఈ సినిమా ఒక గొప్ప ప్రేమ కావ్యం అని, నిర్మాత మురగదాస్, డైరెక్టర్ శరవణన్ నా మీద, నా నటన మీద నమ్మకం ఉంచి నన్ను తీసుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు, అంతే కాదు సహా నటులు జై, అనన్య, అంజలిలకి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు శర్వానంద్. ఈ సినిమాని, నన్ను ఆదరించిన తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు తెలుగు, తమిళంలో సినిమాలకి ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు.
శర్వానంద్, జై, అనన్య, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే రెండు కోట్లకు పైగానే కలెక్షన్స్ చేసింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. క్రిటిక్స్ అభినందనలు కూడా అందుకుంటోంది. ఈ విజయాన్ని రేపు తెలుగులో కూడా ఈ సినిమా రిపీట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాత. ఇటీవలికాలంలో తమిళంలో రూపొందిన చిత్రాల్లో ఇదొక అద్భుతమైన చిత్రం. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలనే తపనతో భారీ పోటీ నెలకొన్నప్పటికీ అనువాద హక్కులు సొంతం చేసుకుని ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులోకి అనువదిస్తున్నట్లు సమాచారం.
శర్వానంద్ హీరోగా వసంత బాలన్, మురగదాస్ ల దర్శకత్వంలో రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయి. తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ తమిళంలో కూడా గొప్ప పేరు సాధిస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











