ఆ హీరోకు నయనతార వ్యానెటీ వ్యాన్ లోకి నో ఎంట్రీ

By Srikanya

నయనతారని రీసెంట్ గా తమిళ హీరో శింబు సరసన చేయించటానికి ఓ నిర్మాత ఎప్రోచ్ అయ్యాడు. దానికి ఆమె సవాలక్ష కండీషన్స్ పెట్టింది. అందులో మొదటిది సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం శింబు తన వ్యానెటీ వాన్ వద్దకు రావటానకి వీల్లేదని..రెండవది..పర్శనల్ గా మాట్లాడటానికి ట్రై చేయకూడదని...మూడోది..ఆమెకు మూడు కోట్లు రెమ్యునేషన్ ఇవ్వాలని. ఇప్పటివరకూ ఏ సౌతిండియిన్ హీరోయిన్ కి రెండు కోట్లు మించి రెమ్యునేషన్ ఇవ్వలేదు..దాంతో ఈ కండిషన్స్ విన్న నిర్మాత షాక్ అయ్యారు.

ఇక ఈ కండీషన్స్ కు నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచనలో పడుతున్నారు. ఇక ఈ చిత్రం పేరు వాలు. దర్శకుడు అమ్మరాజశేఖర్ అశోశియేట్ విజయ్..అతను ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబు,నయనతార కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తే గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందని భావించి చాలా కాలంగా ఆమెను ఎప్రోచ్ అవుతున్నారు.

ఇక నయనతర కి శింబుకి మధ్య చాలా కాలం క్రితం చెడింది. ఆ తర్వాత సీన్ లోకి ప్రభుదేవా వచ్చాడు. అయితే రీసెంట్ గా ప్రభుదేవాతో ఆమెకు పూర్తిగా విభేదాలు వచ్చాయి. త్వరలో వివాహం జరుగుతుందనుకున్న టైమ్ లో విభేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. దాంతో ఆమె వరసగా సినిమాలు కమిటవుతోంది. ఇదే అదనుగా శింబు కూడా ఆమె తన ప్రక్కన చేయించుకుని తిరిగి తమ బంధాన్ని పునరుద్దరించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని చెన్నై టాక్.

ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X