మోసం చేసారంటూ నిర్మాతపై హీరోయిన్ ఫిర్యాదు
తమిళ నటి షెరినా రీసెంట్ గా 'పువ్వా త లైయా'చిత్ర నిర్మాత సంజయ్‌రామ్ పై నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ చిత్రం రేపు (శుక్రవారం)విడుదల కానుంది. తనకు ఐదు లక్షల రూపాయలు పారి తోషికం బాకీ ఉందని, ఆ డబ్బును తీసివ్వాలని హీరోయిన్ షెరినా నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేసింది. దీని గురించి షెరినా తల్లి మాట్లాడుతూ దర్శక నిర్మాత సం జయ్‌రామ్ పువ్వాతలయా చిత్రంలో నటించమని కోరి నప్పుడు 15 లక్షల రూపా యల పారితోషికం అడిగామని చెప్పారు. తొమ్మిది లక్షలు ఇస్తానని ఆయన చెప్పడంతో ఒప్పుకున్నామన్నారు. తొలి విడతగా నాలుగు లక్షలు ఇచ్చారని, మరో ఐదు లక్షలు చెల్లించలేదని తెలిపారు.
షూటింగ్ చివరి దశలో అడగ్గా చిత్రం పూర్తి అయిన తర్వాత ఇస్తానన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు చిత్ర విడుదల డేటును ప్రకటించారని, పారితోషికం గురించి పట్టించుకోవడం లేదని వివరించారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. షెరినా ఫిర్యాదు గురించి సంజయ్‌రావు మాట్లాడుతూ ఆమె తన చిత్రంలో నటించడానికి 20 రోజులు కాల్‌షీట్స్ ఇచ్చిందని వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఆమె తనకు చాలా ఇబ్బందులు సృష్టించిందని అన్నారు. తద్వారా తాను చాలా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సమస్యను నడిగర్ సంఘం పరిష్కరించిందని, ఇప్పుడెలాంటి సమస్యా లేదని అన్నారు.


Click it and Unblock the Notifications











