twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్య ని కాదన్న మణిరత్నం

    By Staff
    |

    Aishwarya Rai Bachchan
    మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రావణ చిత్రంలో నటిస్తున్న ఐశ్వర్యకు..మరో నటి శోభన నృత్యరీతులను అందిస్తోంది. శాస్త్రీయ నృత్యం ప్రాధాన్యత ఉన్న పాత్ర కావటంతో ప్రత్యేకంగా శోభనను పిలిపించి మణిరత్నం ఈ ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. అయితే శోభన తయారు చేసిన మై రావణ డాన్స్ సన్నివేశం ఎంత ప్రాక్టీస్ చేసినా ఐశ్వర్య ఫెరఫెక్ట్ గా చేయకపోయింది. ఉన్నంతలో వచ్చిన వరకూ ఐశ్వర్య చేస్తానంటే మణిరత్నం ఒప్పుకోలేదట.

    మరి వదిలేస్తారా..ఆ సీక్వెన్స్ అనుకున్న వారికి ట్విస్ట్ ఇఛ్చాడు. ఆ సీక్వెన్స్ ని శోభన పైనే మణిరత్నం చిత్రీకరించాడని సమాచారం. ఐతే శోభన గతంలోనూ మణిసార్ కి ఇష్టమైన నటి. అలాగే ఈ నృత్యం ఈ సినిమాకు హైలైట్స్ ఒకటి కానుందని యూనిట్ సభ్యులు ధీమాగా చెప్తున్నారు. అభిషేక్ బచ్చన్, విక్రమ్, పృధ్వి, ప్రియమణి వంటి హేమీహేమీలు నటిస్తున్న ఈ చిత్రం రామాయణాన్ని అనుకరిస్తూ సాగుతుందని ఒక రూమర్ ఉంది. అయితే దీన్ని మణిరత్నం ఖండించిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X