మణిరత్నంకు రజనీకాంత్ కూతురు షాక్.. చివరకు ఏం జరుగుతుందో?
మణిరత్నం సినిమా వస్తుంది అంటే కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు... దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మణిరత్నం దర్శకత్వంలో చివరగా వచ్చిన 'నవాబ్' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది.
మణిరత్నం తన తర్వాతి సినిమా ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారని, 'పొన్నియిన్ సెల్వన్' అనే హిస్టారికల్ నవల ఆధారంగా ఈ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మణిరత్నంకు షాకిచ్చే నిర్ణయం రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య తీసుకున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి.

అదే కథతో రజనీకాంత్ కూతురు కూడా..
కొన్ని రోజుల క్రితం సౌందర్య తాను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు, ‘పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని ప్రకటించారు. వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ‘ఎంఎక్స్ ప్లేయర్' వారితో కలిసి ఆమె దీన్ని నిర్మించబోతున్నారు. సూర్య ప్రతాప్ ఎస్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు.

మణిరత్నం ఏం చేయబోతున్నారు
అయితే మణిరత్నం ఇప్పటి వరకైతే తన చిత్రం గురించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. అంతకంటే ముందే రజనీకాంత్ కూతురు నుంచి అనౌన్స్‌మెంట్ రావడంతో అంతా షాకయ్యారు. మణిర్నతం నెక్ట్స్ స్టెప్ ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది.

భారీ తారాగణంతో ప్లాన్ చేసిన మణిరత్నం
మణిరత్నం తాను తీయబోయే చిత్రాన్ని విక్రమ్, విజయ్ సేతుపతి, జయంరవి, ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలు పోషించబోతున్నారని, దుల్కర్ సల్మాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితమే మణి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా.. భారీ బడ్జెట్ అవసరం అవ్వడం వల్ల దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆయన ఈ ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టి.. పాత్రల ఎంపిక విషయంలో బిజీ అయిపయారు.

పొన్నియిన్ సెల్వన్
‘పొన్నియిన్ సెల్వన్' నవలను కల్కి కృష్ణ మూర్తి రాశారు. తమిళంలోని హిస్టారికల్ నవలల్లో ఇదీ ఇకటి. 5 భాగాలుగా ఉన్న ఇది... 1వ రాజరాజ చోళుడి జీవితాన్ని ప్రతిభించేవిధంగా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











