డైరెక్టర్ శంకర్‌కు మరో దెబ్బ.. ఇండియన్ 2 స్టోరీ లీక్..

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2 చిత్రానికి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇండియన్ 2 చిత్రం ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నో అవాంతరాలు ముందు వచ్చి పడ్డాయి. ఓ దశలో సినిమాను రద్దు చేశారనే వార్త కూడా మీడియాలో ప్రచారమైంది. అయితే ఎన్నో రూమర్లకు, గాసిప్స్‌ను దాటుకొంటూ ఇండియన్ 2 సెట్స్‌పైకి వెళ్లింది. అయితే తాజాగా ఇండియన్ 2 సినిమాను మరో లీక్ వార్త వెంటాడింది. ఇంతకు ఆ వార్త విషయమేమిటంటే..

ఇండియన్ 2 కథ లీక్

ఇండియన్ 2 కథ లీక్

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఇండియన్ 2 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నది. అయితే ఈ సినిమా కథ లీక్ అయ్యిందనే వార్త తమిళ మీడియాను కుదిపేసింది. ప్రస్తుతం ఈ లీక్ వార్తపై లైకా నిర్వాహకులు పెదవి విప్పడం లేదు. అయితే ఇంతకు కథ నిజంగానే లీక్ అయిందా అంటే వివరాలు ఏమి అందుబాటులోకి రాలేదు. కానీ లీకైన కథ మాత్రం మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.

లీకైన ఇండియన్ కథ ఇదే

లీకైన ఇండియన్ కథ ఇదే

ఇండియన్ 2 కథ లీకైనట్టు పేర్కొంటున్న కథనం ప్రకారం.. ఈ చిత్రంలో సిద్ధార్థ్ (కమల్ హాసన్) ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిగా ఉంటారు. దేశంలో పేరుకుపోతున్న అవినీతిపై తన పరిధిలో పోరాటం చేస్తుంటాడు. పలువురు రాజకీయ నేతల అవినీతి బండారాన్ని యూట్యూబ్ కథనాల ద్వారా బయటపెడుతుంటాడు. దాంతో ఆయన లైఫ్ గందరగోళంగా మారుతుంది. ఈ వీడియోలను చూసిన ఇండియన్ తాతా సేనాపతి.. అవినీతి నేతల భరతం పట్టేందుకు బయటకు వస్తాడు. దేశంలోని అవినీతి రాజకీయ నేతలను ఎలా శిక్షించాడు అనేది ఈ సినిమా కథ అనేది వార్తల సారాంశం.

రకుల్, కాజల్, భవానీ ముఖ్య పాత్రల్లో

రకుల్, కాజల్, భవానీ ముఖ్య పాత్రల్లో

ఇండియన్ 2 చిత్రంలో సిద్దార్థ్ భార్యగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. ప్రియా భవానీ శంకర్ జర్నలిస్టుగా కనిపించబోతున్నది. కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ పరిశోధకురాలిగా నటిస్తున్నట్టు సమాచారం. సేనాపతికి చేదోడు వాదోడుగా ఉండే పాత్రలో కాజల్ కనిపిస్తారని తెలిసింది. ఈ కథ, పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ.. నిజంగా ఇండియన్ 2 కథ ఇలానే ఉంటుందా అంటే సమాధానం లేదు.

2020 ఏడాదిలో రిలీజ్

2020 ఏడాదిలో రిలీజ్

ఇక ఇండియన్ 2 చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమల్ హాసన్ కెరీర్‌లో ఇదే చివరి చిత్రం అనే మాట వినిపిస్తున్నది. ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X