twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్‌కు ఎదురుదెబ్బ.. మెర్సల్‌పై నిషేధం.. షాకిచ్చిన హైకోర్టు..

    తలపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ పక్క మెర్సల్ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతుంటే.. ఆ చిత్ర టైటిల్ వివాదంలో చుట్టుకొన్నది. తాజా రిపోర్టుల ప్రకారం తన అనుమతి లేకుండా మెర్సల్ టైట

    By Rajababu
    |

    Recommended Video

    Vijay's Mersal BANNED By HC మెర్సల్‌పై నిషేధం, యూట్యూబ్‌లో టీజర్ రికార్డ్.....

    తలపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ పక్క మెర్సల్ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతుంటే.. ఆ చిత్ర టైటిల్ వివాదంలో చుట్టుకొన్నది. తాజా రిపోర్టుల ప్రకారం తన అనుమతి లేకుండా మెర్సల్ టైటిల్ వాడుకొన్నాడని చేసిన ఫిర్యాదుకు చెన్నై కోర్టు స్పందించింది. దాంతో కొన్ని రోజులపాటు ప్రమోషన్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..

    నిబంధనలకు విరుద్ధంగా..

    నిబంధనలకు విరుద్ధంగా..

    నేను మెర్సల్ టైటిల్‌ను 2014లొ రిజిస్ట్రేషన్ చేయించాను. నా పేరున టైటిల్ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నా టైటిల్‌ను విజయ్ సినిమాకు పెట్టారు అని పిటిషన్‌దారు చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు తీవ్రంగా స్పందించింది.

    తాత్కాలిక నిషేధం

    తాత్కాలిక నిషేధం

    ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టవద్దని తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పది రోజులు ప్రమోషన్ నిలిపివేయాల్సి వచ్చింది. దాంతో మెర్సల్‌కు వచ్చిన క్రేజ్ ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    రిలీజ్‌పై ప్రభావం..

    రిలీజ్‌పై ప్రభావం..

    మెర్సల్ ప్రమోషన్‌పై తాత్కాలిక నిషేధం విధించడం వల్ల రిలీజ్‌పై ప్రభావం పడుతుందా అని అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఈ చిత్రాన్ని దీపావళీ కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేశారు.

    24 గంటల్లో సునామీ..

    24 గంటల్లో సునామీ..

    మెర్సల్ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో కోటి వ్యూస్ రావడం విజయ్ స్టామినాకు అద్దం పట్టింది. ఈ విధంగా కోటి వ్యూస్ సాధించడం సినీ పరిశ్రమలో ఓ రికార్డుగా చెప్పకొంటున్నారు. అజిత్ నటించిన వివేకం చిత్ర టీజర్ రికార్డును కూడా మెర్సల్ తిరగరాసింది.

    మూడు పాత్రల్లో..

    మూడు పాత్రల్లో..

    మెర్సల్ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో విజయ్ కనిపించనున్నారు. రాజకీయ నాయకుడిగా, మెజీషియన్‌గా, డాక్టర్‌గా మూడు డిఫరెంట్ లుక్స్‌లో విజయ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్‌లకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తున్నది.

    ముగ్గురు హీరోయిన్లతో..

    ముగ్గురు హీరోయిన్లతో..

    మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీత సారథ్యంలో వస్తున్న మెర్సల్ చిత్రంలో సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్, నిత్యమీనన్ కథానాయికలు. రెహ్మాన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం మెర్సల్.

    English summary
    After tremendous success,Thalapathy Vijay‘s Mersal faces it first controversy 24 hours later. Report reveal that Sri Thenandal Films allegedly went ahead with the title Mersal without registration as per a petitioner who filed a case in the Chennai court. He now wants to put a stop to the film promotions with this title. Following this complaint, the court has ordered a temporary ban on the film’s promotional activities until October 3rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X