twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    By Bojja Kumar
    |

    చెన్నై: విశ్వరూపం చిత్రాన్ని డిటిహెచ్ ద్వారా నేరుగా టీవీల్లో విడుదల చేయాలనే కమల్ హాసన్ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తమిళనాడు థియేటర్ల యజనుల సంఘం...... తాజాగా 'విశ్వరూపం' చిత్రాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్న(జనవరి 3)న తిరుచ్చిలో సమావేశం అయిన థియేటర్ల యజమానులు థియేటర్ల కంటే ముందు డిటిహెచ్ ద్వారా సినిమాలను విడుదల చేయడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంస్కృతికి బీజం పడనీయబోమని, అందుకే 'విశ్వరూపం' చిత్రాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

    ఈ నెల 10లోపు కమల్ హాసన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, 'డిటిహెచ్' ఆలోచన మానుకుని రాజీకి రావాలని, లేకుంటే సినిమాను తమిళనాడు విడుదల చేయబోమని హెచ్చరించారు. 'విశ్వరూపం' చిత్రంతో డిటిహెచ్ సంస్కృతి మొదలైతే అన్ని సినిమాలు అదే దారిలో పయనిస్తాయని, టీవీల్లో సినిమా చూసే సౌకర్యం వచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని, దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని థియేటర్ల యజమానుల సంఘం ఆందోళన చెందుతోంది.

    ఈ నేపథ్యంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది. మరి కమల్ హాసన్ తన డిటిహెచ్ ఆలోచన నుంచి వెనక్కి తగ్గుతారా? తన సినిమాను ఎలా విడుదల చేసుకుంటారు? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

    తెలుగులో విశ్వరూపం చిత్రాన్ని జనవరి 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియా ఏపీలో ఈచిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తమిళ థియేటర్ యజమానుల సంఘంతో వివాదం ఓ కొలిక్కి వస్తే తప్ప తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    థియేటర్ల యజమానుల సంఘం తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ రామా ఎం.అన్నామలై మాట్లాడుతూ కమల్ హాసన్ ‘విశ్వరూపం' చిత్రం డిటిహెచ్ రిలీజ్ ను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    డిటిహెచ్ కంపెనీలతో కమల్ హాసన్ తన డీల్ రద్దు చేసుకున్న తర్వాతే విశ్వరూపం చిత్రం విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    థియేటర్ల యజమానుల సంఘం ఈ వివాదంపై ముఖ్యమంత్రి జయలలితను కూడా కలిసారు.

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    నిన్న జరిగిన థియేటర్ల సంఘం సమావేశంలో దాదాపు 700 మంది సభ్యులు పాల్గొన్నారు. డిటిహెచ్ రిలీజ్ సంస్కృతిని అడ్డుకునేందుకు విశ్వరూపం సినిమాను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

    కమల్‌ హాసన్‌కు షాక్: ‘విశ్వరూపం’పై బహిష్కరణ

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వరూపం' చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా ముఖ్య పాత్రలు పోషించారు.

    'విశ్వరూపం' చిత్రాన్ని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌.

    English summary
    Tamilnadu Theatre Owners Association and the Confederation of Theatre Owners and Distributor's Associations have announced their stand on the release of Kamal Hassan's Vishwaroopam. They have confirmed that the film will not be released in entire state for the actor's decision to air the film directly on DTH platforms. The meeting was held on Thursday in Tirchy (January 3) and the guilds have passed the resolution to boycott Vishwaroopam. Neither distributors will buy the film nor theatre owners will screen those movies, which will be directly aired on DTH platforms, said an association member.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X