నయనతారపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్, ఆమె జాతకం.. శింబు, నయన్ బ్రేకప్‌కు కారణం ఇదే!

Recommended Video

Shocking Reason Behind Nayanthara And Simbu Break Up

నయనతార ప్రస్తుతం దక్షిణాదిలో లేడి సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలు ఓవైపు చేస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా విజయాలు అందుకుంటోంది. దర్శక నిర్మాతలకు నయనతార మోస్ట్ వాంటెండ్ హీరోయిన్. నయనతార వ్యక్తిగత జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు పర్యాయాలు ఆమె ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచింది. ఆమె రెండు సార్లు పెళ్లి వరకు వచ్చి నయన్ ప్రేమకథలు ముగిశాయని వార్తలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవా తో నయన్ సాగించిన ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. నయన్, శింబు విడిపోవడానికి దర్శకుడు జిటి నందు సంచలన కారణం వెల్లడించాడు.

నయన్, శింబుతో సినిమా చేద్దామని

నయన్, శింబుతో సినిమా చేద్దామని

దర్శకుడు నందు అప్పట్లో నయన్, శింబు జోడిగా కెట్టవన్‌ అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ చిత్రంలో నటించేందుకు నయన్ ఒప్పుకోలేదు. శింబు కూడా తరువాత చేద్దాంలే అని చెప్పాడు. ధనుష్ తో తెరకెక్కించాలని ప్రయత్నించా కుదర్లేదు. చివరకు శింబు హీరోగానే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది.

శింబుతో విభేదాలు

శింబుతో విభేదాలు

తాను ధనుష్ ని కలిసిన విషయం శింబుకు తెలియడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నన్ను శింబు దూరం పెట్టారు. అలా కెట్టవన్‌ చిత్రం పూర్తిగా శింబు చేతుల్లోకి వెళ్లిందని దర్శకుడు నందు అప్పట్లో జరిగిన సంగతులు వివరించాడు.

కమర్షియల్ హీరోయిన్

కమర్షియల్ హీరోయిన్

నయనతార 2015లో వచ్చిన మాయ చిత్రంలో అద్భుతంగా నటించింది. అప్పటివరకు ఆమె ఒక కమర్షియల్ హీరోయిన్ మాత్రమే. 2015 నుంచి నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత పెరిగిందని జిటి నందు తెలిపారు.

విడిపోవడానికి కారణం

విడిపోవడానికి కారణం

నయన్, శింబు విడిపోవడానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటివరకు నయన్, శింబు పెళ్లి చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. వారిద్దరూ విడిపోవడం ఎవరూ ఊహించలేదని జిటి నందు తెలిపారు. నయన్, శింబు విడిపోవడానికి తనకు కూడా ఓ కారణం తెలుసు అని అన్నారు.

నయనతార జాతకం

నయనతార జాతకం


చాలా కాలం ముందు తాను, శింబు తరుపున వ్యక్తి ఓ జ్యోతిష్కుడిని కలిసాం. ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆయన చాలా ప్రసిద్ధి గాంచిన జ్యోతిష్కుడు. శింబు, నయనతార జాతకాలని ఆయన పరిశీలించారు. నయనతారకు ఇప్పుడు వివాహం జరిగితే ఆమె రోడ్డున పడే అవకాశం ఉంది. ఆమె జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు జోతిష్కుడు తమతో చెప్పాడని జిటి నందు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శింబుకు నయన్ దూరం కావడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉండవచ్చు అని అభిప్రాయం పడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X