స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ్ రీమేక్.. తెరవెనుక విజయ్ సేతుపతి ప్రయత్నాలు!
ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో ఉప్పెన బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. మాస్ రాజా రవితేజ క్రాక్ కంటే కూడా అత్యదిక వసూళ్లను కేవలం నాలుగు రోజుల్లోనే అందుకుంది. ఉప్పెన సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో ఇతర ఇండస్ట్రీలో కూడా సినిమా హాట్ టాపిక్ గా మారింది. దీంతో తప్పకుండా రీమేక్ చేయడమైతే జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా ఒక స్టార్ హీరో తనయుడు ఉప్పెన ద్వారా పరిచయం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళ్ రిలీజ్ వద్దని చెప్పిన సేతుపతి
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా సినిమా క్లిక్కవుతుందని తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

ఎందుకు వద్దన్నాడు అంటే..
విజయ్ సేతుపతి వద్దనడానికి కారణం లేకపోలేదు. ఉప్పెన సినిమాలో ఉప్పడ బీచ్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి వారి జీవిన శైలి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విషయం తెలిసిందే. అయితే తమిళ్ లో సముద్రపు ఒడ్డున జీవించే వారి లైఫ్ మరొక విధంగా ఉంటుంది. పైగా ఉప్పెన లాంటి కథను వారి వాతావరణానికి తగ్గట్లు తెరపైకి తెస్తేనే బావుంటుందని చెప్పాడట.

రీమేక్ రైట్స్ తీసుకొని..
మంచి కథ కాబట్టి అనవసరంగా డబ్ చేసి వృధా చేయవద్దని విజయ్ సేతుపతి సలహా ఇచ్చాడట. అలాగే విజయ్ సేతుపతి ఈ సినిమా తమిళ్ రైట్స్ పై కన్నేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా సరిపోతుందట. అతను మరెవరో కాదు. తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్.

ఉప్పెన కథ.. తలపతికి నచ్చిందట
విజయ్ కుమారుడు సంజయ్ వయసు ఇప్పుడు 20 ఏళ్ళు. అయితే అతని ఎంట్రీ కోసమే ప్రస్తుతం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సేతుపతి మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ కు కథ గురించి చెప్పాడట. విజయ్ కు కూడా స్టోరీ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదట. మరి సినిమా తమిళ్ లో వస్తే అక్కడి జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











