»   » శింబు-హన్సిక లవ్ ఎఫైర్ చెడింది

శింబు-హన్సిక లవ్ ఎఫైర్ చెడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో శింబు, హీరోయిన్ హన్సిక కొన్ని నెలల క్రితం అభిమానులకు ఓ తీయటి కబురు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని....తమపై లేని పోని వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాకు విన్నవించారు కూడా. ప్రేమలో ఉన్నామని స్వయంగా ఒప్పుకోవడంతో ఇద్దరి అభిమానులు సంతోష పడ్డారు.

తాజాగా తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే....ఇద్దరి మధ్య నడుస్తున్న లవ్ ఎఫైర్ చెడిందని, ఇద్దరూ విడిపోయారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్నారని, ఒకరి గురించి ఒకరు పట్టించుకోకుండా తమ కెరీర్‌పై దృష్టి కేంద్రీకరించారని సమాచారం.

ఇటీవల జరిగిన ఓ అవార్డు సెర్మనీలోనూ శింబు, హన్సిక కలిసి కనిపించలేదు. హన్సిక తన అవార్డును తీసుకుని మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఆమె వెళ్లి పోయిన తర్వాత శింబు సదరు అవార్డుల కార్యక్రమానికి చేరుకున్నారు. దీన్ని బట్టి ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని చర్చించుకుంటున్నారు.

నిందలు వేసుకోదలుచుకోలేదు

నిందలు వేసుకోదలుచుకోలేదు


విడిపోయిన సందర్భంగా శింబు, హన్సిక ఒకరిపై ఒకరు నిందలు వేసుకోదలుచుకోలేదు. తాము ఎందుకు విడిపోయామో అనే విషయాన్ని కూడా సీక్రెట్‌గానే ఉంచాలని నిర్ణయించుకున్నారట.

గౌరవప్రదంగా విడిపోవాలని

గౌరవప్రదంగా విడిపోవాలని


శింబు, హన్సిక గౌరవ ప్రదంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు చేసుకోవడం వల్ల పరువు పోతుందనే ఈ నిర్ణయానికి వచ్చారట.

అభిమానులు షాకయ్యారు

అభిమానులు షాకయ్యారు


శింబు, హన్సిక విడిపోయారనే విషయాన్ని తెలుసుకుని అటు శింబు అభిమానులతో పాటు, హన్సిక అభిమానులు కూడా షాకయ్యారు.

నాలుగు సినిమాలతో శింబు బిజీ

నాలుగు సినిమాలతో శింబు బిజీ


ప్రస్తుతం శింబు నాలుగు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గౌతం మీనన్ దర్శకత్వంలో ఓసినిమాతో పాటు, వాలు, వెట్టై మన్నన్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

రెండు సినిమాల్లో కలిసి నటించారు

రెండు సినిమాల్లో కలిసి నటించారు


ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరు వాలు, వెట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చిన నేపథ్యంలో ఈచిత్రాలను కలిసి ప్రమోట్ చేస్తారో? లేదో? అనేది సందిగ్ధంగా మారింది.

8 చిత్రాల్లో హన్సిక

8 చిత్రాల్లో హన్సిక


ప్రస్తుతం హన్సిక చేతిలో ఏకంగా 8 చిత్రాలు ఉన్నాయి. తెలుగుతో పాటు, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.

English summary

 Silambarasan and Hansika Motwani had given a sweet news for all their fans a few months ago. They had announced that they were in love and had requested media not to speculate about their relationship any more. But now, we hear, a shocking news. Well, rumour mills say that the couple has parted ways.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu