twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నైలో శ్రీదేవి సంస్మ‘రణం’ ట్విస్టులపై ట్విస్టులు.. హైడ్రామా..

    By Rajababu
    |

    అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని వీడి పక్షం రోజులు కావొస్తున్నప్పటికీ.. ఆమె మరణం వెనుక అనుమానాలు, వివాదాలకు తెరపడకపోవడం అభిమానులకు షాకింగ్ మారింది. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో శ్రీదేవి ఓ హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి సంస్మరణ సభను మార్చి 10వ తేదీన అంటే చెన్నైలో నిర్వహించారు. అయితే శ్రీదేవి సోదరి గురించి, ఇంకా అక్కడ కనిపించిన కొన్ని పరిస్థితులు వివాదంగా మారాయి.

    Recommended Video

    శ్రీదేవి ముఖాన్నిచూసి టీవీ కట్టేశాను....
     చెన్నైలో శ్రీదేవి సంస్మరణ సభ

    చెన్నైలో శ్రీదేవి సంస్మరణ సభ

    చెన్నైలో జరిగిన శ్రీదేవి సంస్మరణ సభకు తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, ఏఆర్ రెహ్మన్ దంపతులు, అజిత్, తదితరులతోపాటు బోనికపూర్, జాహ్నవి, ఖుషీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి సోదరి శ్రీలత, ఆమె భర్త సంజయ్ రామస్వామి కూడా పాల్గొన్నారు.

    శ్రీదేవి మామ సంచలన వ్యాఖ్యలు

    శ్రీదేవి మామ సంచలన వ్యాఖ్యలు

    శ్రీదేవి మృతి నేపథ్యంలో ఆమె మామ వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బోనికపూర్‌ను పెళ్లి చేసుకోవడం శ్రీదేవి తల్లికి ఇష్టం లేదు. శ్రీదేవి, బోని వ్యవహారంపై ఆమెకు అసంతృప్తి ఉండేది. పలు సందర్భాల్లో ఇంటికి వచ్చిన శ్రీదేవి దంపతులను సరిగా రిసీవ్ చేసుకోలేదు అని వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

    బోని, శ్రీదేవి పెళ్లిపై..

    బోని, శ్రీదేవి పెళ్లిపై..

    తల్లికి ఇష్టం లేకపోయినా బోనికపూర్, శ్రీదేవి పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారు. తన తల్లికి చెప్పకుండానే వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు అని వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో శ్రీదేవి మరణం తర్వాత కుటుంబంలో విభేదాలు ఉన్నట్టు స్పష్టమయ్యాయి.

     శ్రీదేవికి మనశ్శాంతి లేదు..

    శ్రీదేవికి మనశ్శాంతి లేదు..

    బోనికపూర్‌తో పెళ్లి తర్వాత శ్రీదేవికి మనశ్శాంతి లేదు. బయటి ప్రపంచానికి ఆమె పెదవిపై చిరునవ్వును తెచ్చిపెట్టుకొనేది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా బాధకు గురైంది అని చెప్పింది. బోని తీసిన సినిమా రిలీజ్ కాకపోవడంతో శ్రీదేవి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది అని వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

    పీకల్లోతు అప్పుల్లో శ్రీదేవి

    పీకల్లోతు అప్పుల్లో శ్రీదేవి

    అప్పుల్లో కూరుకుపోవడంతో చేసేది ఏమీ లేక శ్రీదేవి తన ఆస్తులు అమ్మి అప్పులు తీర్చింది. అయినా వారి ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీదేవి తిరిగి యాక్టింగ్ చేపట్టింది అని ఆయన అన్నారు.

    కూతుళ్ల భవిష్యత్‌పై బెంగ

    కూతుళ్ల భవిష్యత్‌పై బెంగ

    గతంలో తమ కుటుంబ సభ్యుల శ్రీదేవిని కలిశారు. ఆ సమయంలో తన కూతుళ్లు జాహ్నవి, ఖుషీల భవిష్యత్‌తో ఆందోళన చెందేది. బోనికపూర్ ఆరోగ్యం కూడా బాగాలేకపోవడం ఆందోళనగా ఉంది అని శ్రీదేవి చెప్పింది అని వేణుగోపాల్ వెల్లడించారు.

    వికటించిన శ్రీదేవి తల్లి సర్జరీ

    వికటించిన శ్రీదేవి తల్లి సర్జరీ

    శ్రీదేవి తల్లికి అమెరికాలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఓ పక్క సర్జరీ చేయబోయి మరోపక్క చేవారు. దాంతో ఆమె మంచానికే పరిమితమైంది. శ్రీదేవి తల్లి కోమాలోకి వెళ్లిన పరిస్థితి ఎదురైంది. ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేది అని వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.

     హాస్పిటల్‌పై దావా.. పరిహారం

    హాస్పిటల్‌పై దావా.. పరిహారం

    తమ తల్లికి తప్పుడు సర్జరీ జరిగింది అని తెలుసుకొన్న తర్వాత శ్రీదేవి, శ్రీలత హాస్పిటల్‌పై దావా వేశారు. ఆ తర్వాత కోర్టు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో వచ్చిన డబ్బు పంపకాల సందర్భంగా శ్రీదేవికి, శ్రీలతకు విభేదాలు తలెత్తాయి అని వేణుగోపాల్ రెడ్డి చెప్పడం మరింత వివాదమైంది.

    శ్రీదేవి, శ్రీలత మధ్య విభేధాలు..

    శ్రీదేవి, శ్రీలత మధ్య విభేధాలు..

    ఇదిలా ఉండగా, శ్రీదేవి మరణంపై సందేహం వ్యక్తం చేసిన బంధువు వేణుగోపాల్ రెడ్డి ఎవరో మాకు తెలియదు. నా భార్య కూడా అతడిపై, అతను చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలను రేకెత్తించింది.

    వేణు ఎవరో తెలియదు..

    వేణు ఎవరో తెలియదు..

    ఈ సందర్భంగా సంజయ్ రామస్వామి మాట్లాడుతూ.. శ్రీలతతో పెళ్లి జరిగి 28 ఏళ్లు అయింది. ఏ సందర్భంలోనూ వేణుగోపాల్ రెడ్డి గురించి మాట వరుసకైనా పేరు వినలేదు. శ్రీదేవి లేరన్న విషాద వార్తతో ఎలాంటి కామెంట్లు చేయకూడదని కుటుంబం నిర్ణయం తీసుకొన్నది అని అన్నారు.

    విషాదం వేళ వివాదామా?

    విషాదం వేళ వివాదామా?

    శ్రీదేవి మరణ విషాదంలో బోనికపూర్ కుటుంబానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారు. కష్టకాలంలో శ్రీదేవి మృతిని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు సంజయ్‌పై లోలోపల వినిపిస్తున్నాయి. శ్రీదేవి సోదరి ఎందుకు మౌనం వహిస్తున్నదనే సందేహాన్ని మీడియా వ్యక్తం చేస్తున్నది.

    మేము మౌనంగా రోదిస్తుంటే..

    మేము మౌనంగా రోదిస్తుంటే..

    శ్రీదేవి మరణంపై ఓ పక్క మౌనం వహిస్తుంటే కొందరు వివాదం చేయడానికి ప్రయత్నించారు. ఓ పక్క ఎలాంటి పబ్లిసిటిని కోరుకోకుండా మౌనంగా రోదిస్తూంటే ఇలాంటి చోటు చేసుకోవడం బాధగా ఉంది అనే మాటలు సంస్మరణ సభలో వినిపించాయి.

    English summary
    Legendary actress Sridevi, who passed away in Dubai on February 24, 2018, was fondly remembered in a prayer meet organised in Chennai. It was attended by Boney Kapoor, Khushi Kapoor and Janhvi Kapoor along with Sridevi's sister Srilatha and her husband Sanjay Ramaswami. While, many celebs visited the venue to pay their respect, an official statement from Sridevi's sister's husband came as a shocker to us. You must be aware about the controversial statements of Venugopal Reddy, who claimed that he's Sridevi's uncle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X