twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ హాట్‌గా పిచ్చెక్కించిన శ్రద్దా శ్రీనాథ్... ఐటమ్ నంబర్‌‌తో రెచ్చగొట్టిన జెర్సీ హీరోయిన్!

    |

    నేచురల్ స్టార్ నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రంలో సంప్రదాయ గృహిణి పాత్రలో కుటుంబ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఫీల్‌‌గుడ్ హీరోయిన్‌గా కనిపించిన శ్రద్ధా.. హాట్ హాట్‌గా దర్శనమిచ్చి ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఆమె చేసిన ఐటమ్ సాంగ్ ఏ చిత్రంలోనిదంటే..

     గ్లామరస్‌గా శ్రద్ధా శ్రీనాథ్

    గ్లామరస్‌గా శ్రద్ధా శ్రీనాథ్

    జెర్సీ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన చిత్రం కే13. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన తమిళ సినిమా మే 3వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రానికి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించగా, సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ బిక్కి లిక్కిలో హాట్ హాట్‌గా కనిపించింది. ఇలా జెర్సీ చిత్రంలో ఫ్యామిలీ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతు్నారు.

    ఐటెం నంబర్‌ పాటలో అందాల ఆరబోత

    ఐటెం నంబర్‌ పాటలో అందాల ఆరబోత

    బిక్కి లిక్కీ అనే ఐటమ్ నంబర్ పాటలో తన గ్లామర్‌తో శ్రద్ధా శ్రీనాథ్ హాట్ హాట్‌గా కనిపించారు. తమిళంలో ఈ చిత్రంపై శ్రద్ధా భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఇటీవల ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా, అనూహ్యమైన స్పందన లభించింది. గ్లామరస్‌గా కనిపించిన శ్రద్ధా కుర్రకారులో హుషారు పెంచిందనే మాట వినిపిస్తున్నది. అందాల ఆరబోతతో ఆకట్టుకొన్నది.

    పింక్ రీమేక్‌లో అజిత్‌తో కలిసి

    పింక్ రీమేక్‌లో అజిత్‌తో కలిసి

    వరుస సినిమాలతో శ్రద్దా క్రేజీ హీరోయిన్‌గా మారిపోతున్నారు. హిందీ చిత్రం పింక్ సినిమా ఆధారంగా రూపొందిన నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ సరసన నటిస్తున్నారు. హిందీలో తాప్సీ పోషించిన పాత్రను శ్రద్ధా చేశారు. ఈ చిత్రానికి దర్శకుడుగా హెచ్ వినోద్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బోనికపూర్ తొలిసారి తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

    కన్నడ యూటర్న్‌తో ఇండస్ట్రీలోకి

    కన్నడ యూటర్న్‌తో ఇండస్ట్రీలోకి

    కన్నడలో యూటర్న్ చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించిన శ్రద్ధా శ్రీనాథ్.. తమిళంలో విక్రమ్ వేద చిత్రంతో పాపులర్ అయ్యారు. పింక్ రీమేక్‌లో ఆఫర్ దక్కించుకొని మరింత క్రేజీగా మారారు. జెర్సీ సినిమాతో టాలెంటెడ్ నటిగా పేరు సంపాదించుకొన్నారు. ఇంకా జోడి, రుస్తుం (కన్నడ), మారా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

    శ్రద్దా శ్రీనాథ్ ఐటమ్ పాట కోసం..

    శ్రద్దా శ్రీనాథ్ ఐటమ్ పాట కోసం..

    English summary
    Shraddha Srinath looks absolutely sizzling hot in a party number from the upcoming film called K13. The psychological thriller is gearing up for a release on May 3rd. Now, a new song from the film K13, titled Bikki Likki, has been unveiled and has opened to a good response from her fans on YouTube. Composed by Sam CS, the song is a party number and Shraddha has taken on a glamorous avatar in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X