శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించిన శ్రియా ఆ చిత్రం సంబరాల్లో ధరించిన దుస్తులకుగాను క్షమాపణ చెప్పింది. జనవరి 11వ తేదీన జరిగిన చిత్రం సిల్వర్ జూబిలీ ఉత్సవాల్లో శ్రియా ధరించిన దుస్తులు హిందూ సంప్రదాయాన్ని కించపరిచేవిగా ఉన్నాయని చెన్నైలోని ఒక సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళులకు, రాష్ట్రంలోని హిందువులకు క్షమాపణలు చెప్పింది. తమిళుల, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆమె వివరణ ఇచ్చుకుంది. తాను ధరించిన దుస్తులు తంటా తెచ్చి పెడతాయని తాను అనుకోలేదని ఆమె అంది. తంజూవూరులో జరిగిన హిందీ సినిమా షూటింగులో పాల్గొంటున్నప్పుడు శివాజీ చిత్రం ఉత్సవాల గురించి తెలిసిందని, దాంతో చిత్రం ఉత్సవాలకు వచ్చానని ఆమె చెప్పుకుంది. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి కరుణానిధి, హిందూ సంస్థకు లేఖలు కూడా రాస్తున్నది.