ముద్దు పెట్టడం నా ధర్మం-శ్రియ
కథానాయిక శ్రియ ఏం చేసినా చాలా బోల్డ్ గా చేస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వున్నప్పుడే తన వారి కోసం ఐటెం సాంగ్స్ చేసి, సరైన కథలు రావడం లేదని ఏకంగా టాలీవుడ్ కే దూరమయ్యి తానెంత డేరింగో చెప్పకనే చెప్పింది. అంతే కాదు పాత్ర డిమాండ్ చేస్తే గుడ్డలూడదీయడానికి కూడా వెనుకాడదు అన్నట్లుగా ఉంటుంది ఆమె తీరు.
ఈ మధ్యే విడుదలయిన అనువాద చిత్రాలు పిస్తా, మల్లన్న చిత్రాల్లో విషాల్, విక్రమ్ కు ముద్దులు కూడా పెట్టేసింది. దీనిపై ఈ మధ్య మీడియా అడిగిన ప్రశ్నకు "ఆ సినిమాల్లో, ఆ సన్నివేశాల్లో ముద్దు పెట్టాల్సిన అవసరం వుంది కాబట్టి అది తన ధర్మంగా భావించి ముద్దు పెట్టానని" తనదైన శైలిలో చాలా బోల్డ్ చెప్పింది. ఇక పై కూడా కథ డిమాండ్ చేస్తే ముద్దు పెట్టడానికి రేడీ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. టాలీవుడ్ లో వున్నప్పుడు మడి కట్టుకొని కూర్చొని, ఇప్పుడు కోలీవుడ్ లో ఇలా రెచ్చిపోవడం ఎంత వరకూ ధర్మమని ఇక్కడి నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి శ్రియ సమాధానమేమిటో??


Click it and Unblock the Notifications











