బబ్లీ 'శ్రియ'
ఇప్పుడు కోలీవుడ్ లో శ్రియ హవా నడుస్తోంది. పెద్ద నిర్మాతల చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇప్పుడున్న నాయికల్లో దక్షిణాదిన టాప్ హీరోలందరి సరసన నటించిన ఏకైక నాయిక శ్రియ. చాలా చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించిన ఆమె త్వరలో ఓ బబ్లీపాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె టాలెంటెడ్ యాక్టర్ ఆర్య సరసన నటిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు ఆ చిత్ర నిర్మాతలు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ లో మూడు హిట్ చిత్రాలకు కాపీ అని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చెయ్యాలనుకొంటున్నారట. మల్లన్న చిత్రంలో హాట్ హాట్ గా కనిపించిన శ్రియ బబ్లీ గర్ల్ గా ఎలా వుండబోతుందోనన్న ఆశక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
shreya bubbly role mallanna vikram pista vishal aarya శ్రియ బబ్లీ పాత్ర మల్లన్న విక్రమ్ పిస్తా విశాల్


Click it and Unblock the Notifications