కిందపడినా పైచేయి శ్రియదే

By Staff

Shreya
రజనీకాంత్ "శివాజీ"తో సంచలన తారగా మారిన శ్రియతో నటించడానికి ఆ తర్వాత పెద్ద హీరోలందరూ పోటీపడ్డారు. తెలుగులో కంటే తమిళంలో ఈ వేలం వెర్రి అధికంగా ఉండేది."శివాజీ" హిట్ కావడంతో అందులో నటించిన వారందరూ అనేక విధాలుగా బాగుపడ్డారు.
కానీ ఆ సినిమా తర్వాత శ్రియకు మంచి సినిమా రాకపోవడంతో తమిళంలో ఆమె కెరియర్ మందగించింది. హాస్యనటుడు వడివేలు సరసన అమె ఎప్పుడైతే ఐటం సాంగ్ చేయడానికి ఒప్పుకుందో అమె పతనం చివరి స్ధాయికి చేరుకుంది. ఆ దెబ్బతో కొందరు తమిళ హీరోలు ఆమెను అంటరానిదానిగా చూశారు. తమ సినిమాలోకి తీసుకోకుండా బహిష్కరించారు. ఇప్పుడు తమిళంలో కందసామి మినహా అమెకు సినిమాలు లేవు.

తమిళంలో జరిగిన అవమానాన్ని అధిగమించేందుకు బాలీవుడ్ కు వెళ్ళిన శ్రియ అక్కడ చక్కగా రాణిస్తోంది. తన టెంపర్ మెంట్ బాలీవుడ్ కే చక్కగా సరిపోతుందని ఆమె ఇప్పుడు బావిస్తోంది. ఆమె బాలీవుడ్ సహచరులు మాత్రం మంచి భవిష్యత్తు ఉందని నమ్మకంతో ఉన్నారు. దీపా మెహతా కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.

More from Filmibeat

Read more about: shriya shivaji vadivelu rajnikanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X