డెంటల్ క్యాప్ లో ప్రత్యక్ష్యమైన హీరోయిన్ శ్రియ
డాన్ శీను సరసన చేసి రీఎంట్రీని సక్సెస్ ఫుల్ గా మొదలెట్టిన శ్రియ తాజాగా చెన్నైలోని ఓ డెంటల్ క్యాంప్ లో ప్రత్యక్ష్యమైంది. కోల్గెట్ పామెలివ్ వారు ఆర్గనైజ్ చేస్తున్న ఈ డెంటల్ క్యాంప్ కి ఆమె హాజరైంది. ఇండియన్ డెంటల్ అశోశియేషన్ వారు కోల్గెట్ వారితో కలిసి చేస్తున్న ఈ పోగ్రామ్ ని ఆమె ప్రమోట్ చేయాలని వచ్చానని చెప్పింది. ఇక ఒక్క రోజులో ఎక్కువ డెంటల్ చెక్ అప్ లు చేసి గిన్నెస్ బుక్ కి ఎక్కే ప్రయత్నం ఇది. తన బిజీ షెడ్యుల్ లో గ్యాప్ ఇచ్చి ఓ సోషల్ ఎవేరనెస్ పోగ్రాం కోసం ఆమె హాజరవటం చాలా మందికి స్పూర్తినిస్తుందని ఆర్గనైజర్స్ అంటున్నారు. ఇక శ్రియ నటించిన కొమురం పులి సక్సెస్ కాకపోవటంతో ఆమె నిరాశలో ఉంది. ఆమె ప్రస్తుతం డాన్ శీను గురించి మాత్రమే మాట్లాడుతోంది.


Click it and Unblock the Notifications











