twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రియ బాత్ టబ్ సీన్..

    By Staff
    |

    Shriya
    సెక్సీ శ్రియ త్వరలో రిలీజ్ కానున్న మల్లన్న సినిమాలో బాత్ టబ్ సీన్నివేశంలో హాట్ హాట్ గా కనిపించనుందని వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. విక్రమ్ హీరోగా చేయనున్న ఈ చిత్రంలో ఆమె తన అందచందాలుతో విందు చేయనుంది. ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని అందుకే సాధ్యమైనంతగా తానేమిటో తన ఆకర్షణ బలం చూపాలని, అనూష్క, నయనతారలకు పోటి ఇవ్వాలని ఆమె బావిస్తోందని సమాచారం. ఇక ఈ నెలాఖరుకు ఈ చిత్రం ఆడియో ప్లాన్ చేస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ అందించే ఎక్సూజ్ మీ మల్లన్న అనే పాట పెద్ హిట్ అవుతుందని దర్శక, నిర్మాతలు నమ్ముతున్నారు.

    అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుంది. విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారు. వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారు.

    ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట. ఇక ఈ చిత్రమే కాక శ్రియ..విశాల్ తో కలిసి పిస్తా అనే చిత్రంలో చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X