సూపర్ స్టార్ రజనీ ఫ్యామిలితో శ్రియకి లింకుందా!
ధనుష్, శ్రియ జంటగా 'కుట్టి" తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ హీరోగారు గురించి శ్రియ మాట్లాడుతూ 'నేను ధనుష్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్. ఆయన భార్య ఐశ్వర్య, కూతురు నాకు బెస్ట్ ప్రెండ్ప్. ఆ కుటుంబంతో ఉంటే ఆత్మీయుల మధ్య ఉన్నటు ఉంటుంది. అందాల తార శ్రియ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సభ్యులకి దగ్గరయ్యారు. రజనీకాంత్ తో 'శివాజి", ఆయన అల్లుడు ధనుష్ తో 'తిరువిళైయాడల్ ఆరంభం, కుట్టి" చిత్రాల్లో జతకట్టారు శ్రియ.
రజనీకాంత్ సరసన 'శివాజీ" లో నటిస్తున్నప్పుడు ఆయన మంచి సలహాలిచ్చేవారు. అలాగే ఆయన అల్లుడు ధనుష్ కూడా చాలా ప్రెండ్లీగా ఉంటారు. తనో సూపర్ స్టార్ కూతురనని, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో భార్యనని ఐశ్వర్య భావించరు. చాలా సింపుల్ గా ఉంటారు. ఆత్మీయంగా పలకరిస్తారు. అంత మంచి కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న 'కుట్టి" షూటింగ్ ఇటీవల తిరునల్వేలిలో జరిగింది అప్పుడు అక్కడున్న నెల్లయప్పర్ గుడిని సందర్శించమని ధనుష్ అన్నారు. ఆ దేవుడ్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందట. దాంతో నెల్లయప్పర్ గుడికి వెళ్లాను. ఇలా ధనుష్ ఎన్నో మంచి సలహాలు ఇస్తుంటారు అన్నారు శ్రియ.


Click it and Unblock the Notifications











